స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా వస్తున్న చిత్రం 'నా పేరు సూర్య'. ఈ సినిమాలో బన్నీ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చాలా సినిమాలకి స్టోరీ అందించిన వకాంతం వంశీ తొలిసారిగా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. కొన్ని రోజులు కింద ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ ఇంపాక్ట్ అని ( టీజర్ ) రిలీజ్ చేసారు. ఆ టీజర్ లో బన్నీ పాత్ర ఏంటో అర్ధం అయ్యిపోయింది. ఇక లేటెస్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోవడంతో... ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది.
ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 77.65 కోట్లకు అమ్ముడైనట్టు తెలుస్తుంది. తెలుగు స్టేట్స్ లో 61.95 కోట్లు.. ఓవర్సీస్ 7.2 కోట్లుకు అమ్ముడైంది. నా పేరు సూర్య ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మీకోసం..
ఏరియా బిజినెస్ ( కోట్లు )
నైజాం 20.20
సీడెడ్ 11.25
నెల్లూరు 2.60
కృష్ణ 4.50
గుంటూరు + వైజాగ్ 14.00
ఈస్ట్ గోదావరి 5.20
వెస్ట్ గోదావరి 4.20
టోటల్ (ఏపీ & టీఎస్) 61.95
రెస్ట్ అఫ్ ఇండియా (తమిళ్ +కర్ణాటక +నార్త్) 8.50
ఓవర్సీస్ 7.20
టోటల్ (వరల్డ్ వైడ్ ) 77.65