సాధారంగా సెలెబ్రెటీస్ బర్త్ డే పార్టీస్ అంటే ఒక రేంజ్ లో ఉంటాయి. చాలా ఖర్చుపెట్టిమరీ పార్టీ ఇస్తుంటారు. ఇలానే నయనతార బర్త్ డే కూడా జరిగిదని చాలామందే భావించారు. నయన్ బర్త్ డే పార్టీ అయితే జరిగింది కానీ ఆ పార్టీ లో ఒకే ఒక్కడు పాల్గొన్నాడు. ఆ ఒక్కడు ఎవరో ప్రత్యేకంగా చెప్పకర్లా.
ఇది గాసిప్ కాదండీ నిజమే. దర్శకుడు విఘ్నేష్ శివన్ స్వయంగా వెల్లడించాడు. 'బర్త్ డే బాష్ విద్ నయన్' అంటూ విఘ్నేష్ సోషల్ మీడియాలో ఫొటో కూడా పోస్ట్ చేశాడు. అంతే కాదు.. ఆ ప్రత్యేకమైన ఫొటోను తన ఫీచర్ ఇమేజ్ గా కూడా పెట్టుకున్నాడు.
ఇటీవలే విఘ్నేష్ శివన్ బర్త్ డే సందర్భంగా నయన్ తన సొంత ఖర్చుతో విఘ్నేష్ ను లాస్ ఏంజెల్స్ తీసుకెళ్లి మరీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసింది. అయితే ఇప్పుడు నయన్ బర్త్ డే విఘ్నేష్ సెలబ్రేట్ చేశాడన్నమాట. వీళ్లిద్దరూ తరచుగా ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పెడుతూనే వున్నారు. దీనిబట్టి వీళ్లిద్దరి మధ్య ప్రేమని రహస్యంగా ఉంచాలనుకోవడం లేదని తెలుస్తుంది.