ఇప్పుడు అందరి చూపు మెగా స్టార్ చిరంజీవి నటించబోయే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీదే ఉంది. ఆ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ పనులు అంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ లు తాత్సారం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం మూడు భాషల్లో తెరకెక్కుతుంది కాబట్టి ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ని ఎక్కిస్తున్నారు.
ఇక ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వొద్దని డైరెక్టర్ కి, నిర్మాతకి చిరు సూచించడం వలెనే ఈ సినిమా ఆలస్యమవుతుందని అంటున్నారు. అందుకే హీరోయిన్ విషయంలో కాంప్రమైజ్ కాలేక ఇప్పటివరకు చిరు కి హీరోయిన్ ని సెట్ చేయలేదట. అయితే మొన్నామధ్యన బాలీవుడ్ నుండి ఐశ్వర్య రాయ్ ని చిరు కోసం దింపుతున్నట్లు వార్తలొచ్చినప్పటికీ ఐష్ అడిగిన రెమ్యునరేషన్ కి గుడ్లు తేలేసిన రామ్ చరణ్ మరో హీరోయిన్ వేటలో పడ్డాడు.
అయితే ఇప్పుడు తమిళంలో నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్న నయనతారను చిరు ఉయ్యాలవాడ కోసం తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నయన్ తో చర్చలు జరిపిన చిత్ర యూనిట్ కి తన పాత్ర నచ్చిందని నయన్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. కాకపోతే ఎక్కువ డేట్స్ ఇవ్వడంపై ఆలోచించి చెబుతానని అన్నట్లు సమాచారం. అయితే చిత్ర యూనిట్ ఉయ్యాలవాడ చిత్రం చారిత్రాత్మక చిత్రం కాబట్టి కాస్త ఎక్కువ కాల్షీట్స్ అడుగుతున్నామని ఆమెకి సర్ది చెప్పారట. అలాగే ఆమె అడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యాయరట.
ఇక నయన్ కొద్దిగా ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్న చిత్ర యూనిట్... నయన్ తో అగ్రిమెంట్ పూర్తయ్యాక హీరోయిన్ విషయం అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ఇక నయనతార తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ మెగా స్టార్ చిరు పక్కన ఈ ఉయ్యాలవాడలో కనిపించనున్నారట. నయన్ పని పూర్తయ్యాక మిగతా హీరోయిన్స్ వేటలోకి చిత్ర యూనిట్ దిగనున్నట్టు చెబుతున్నారు.