నటీనటుల కోసం వెయిటింగ్!

Update: 2017-10-10 08:18 GMT

రామ్ గోపాల్ వర్మ... ఇప్పుడు ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. ఎప్పుడూ రకరకాల కాంట్రవర్సీలతో హాడావిడీ చేసే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద కాంట్రవర్సీ ని భుజాలకెత్తుకున్నాడు. నందమూరి వారసులతో పెట్టుకోవడమే కాదు ఏకంగా ఒక రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబుతో పెట్టుకుంటున్నాడు. టిడిపి పార్టీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. ఎన్టీఆర్ బయో పిక్ కి దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వని కారణంగా లక్ష్మీపార్వతితో సీనియర్ ఎన్టీఆర్ కున్న అనుబంధం పై లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తానంటూ నానా హంగామా చేస్తున్నాడు.

అందులోను ఈ సినిమా ని వైసిపి ఎమ్యెల్యే రాకేష్ రెడ్డి నిర్మిస్తాడని ఎనౌన్సమెంట్ కూడా చేసాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ టైటిల్ తోనే వివాదాలకు ఆజ్యం పోసిన వర్మ ఈ సినిమాని ఎలా పూర్తి చేస్తాడో అనే క్యూరియాసిటీతో రెండు తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే.... ఒక వర్గం వారు మాత్రం సినిమాని ఎలా తెరకెక్కిస్తాడో చూస్తామంటున్నారు ఇక వర్మ ఈ సినిమా విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదని సంకేతాలు పంపుతున్నాడు . ఇక ఈ సినిమాకి నటీనటుల విషయంలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకి విలక్షణ నడుడు ప్రకాష్ రాజ్ ని వర్మ ఎంపిక చేస్తున్నాడనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

మరి ఎన్టీఆర్ పాత్రలో ప్రకాష్ రాజ్ అయితే జీవిస్తాడు. అంతటి విలక్షణ నటుడు ఎన్టీఆర్ పాత్ర ఎలా చేస్తాడు అనే అనుమానమే అక్కర్లేదు ఎవ్వరికి. అయితే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఎలా నటిస్తాడు అన్నది ప్రశ్న కాదు. అసలు లక్షిస్ ఎన్టీఆర్ వంటి వివాస్పద చిత్రంలో ప్రకాష్ రాజ్ నటిస్తాడా? అలాగే ఒక వర్గానికి కొమ్ముకాసి, మరో వర్గానికి వ్యతిరేఖంగా వున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని ప్రకాష్ రాజ్ మోస్తాడా? అనేది ఇప్పుడున్న పెద్ద డౌట్. మరి ఆయన నటించకపోతే వర్మకి నటులే దొరకరా.. అది వేరే విషయం. ఇక ఇప్పుడు వర్మ ముందు మరో పెద్ద బాధ్యత ఉంది. అదేమిటంటే ఎన్టీయార్ జీవితంలో ప్రముఖ పాత్ర పోషించి.. ఆమె వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అల్లకల్లోల ఘటనల్లో కీలక పాత్ర పోషించిన లక్షి పార్వతి పాత్రని వర్మ ఎవరికీ ఇవ్వబోతున్నాడో... అలాగే వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో విలన్ చంద్రబాబే గనక.. మరి బాబు పాత్రకి ఎవరిని ఎంపిక చేయబోతున్నాడనే అంటూ అందరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ నటీనటుల ఎంపిక విషయమై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Similar News