ఫిదా హీరోయిన్ సాయి పల్లవి ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఓవర్ నైట్ లో వచ్చిన స్టార్ డమ్ ని ఎవరైనా కూడా తెగ క్యాష్ చేసుకోవాలని చూస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం డబ్బు కోసం నచ్చని పని చెయ్యనని... తనకి నచ్చిన పనిని మాత్రమే చేస్తానని ఢంకా బజాయించి చెబుతుంది. అంతేకాదు మొదటి సినిమా హిట్ తో ఆమెకి స్టార్ హీరోయిన్ హోదా కూడా వచ్చేసింది. ఆహోదాతోనే ఆమెని కొన్ని షాప్స్ వాళ్లు తన తమ షాప్ ఓపెనింగ్స్ చేస్తే భారీ మొత్తంలో డబ్బు ముట్టజెబుతామన్నా ససేమిరా అంటుంది.
ఇక ఫిదా తర్వాత నాని సరసన ఎంసీఏలో, నాగ సూర్య సరసన ఒక సినిమాలో చేస్తున్న సాయి పల్లవి ఈ రెండు సినిమాల్లో ఒక సినిమాలో దెయ్యంకింద కనబడుతుందనే టాక్ బయటికి వచ్చింది. ఆ సినిమా పూర్తిగా హర్రర్ జానర్ లో తెరకెక్కుతుండగా... ఆసినిమాలో సాయి పల్లవి దెయ్యంగా కనబడుతూ మరోసారి తన హావభావలతో, అల్లరితో, సూపర్బ్ అనిపించే నటనతో సినీజనాల్ని ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావోస్తుందట.
ఇక సాయి పల్లవికి ఫిదా హిట్ తో మంచి మంచి ఆఫర్స్ ఆమె తలుపు తడుతుండగా... సాయి పల్లవి మాత్రం ఆచి తూచి నచ్చిన కథను సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్న ఆమెకి ఒక స్టార్ హీరో పక్కన ఛాన్స్ వచ్చిందట. అయితే ఆ ఛాన్స్ ని సాయి పల్లవి సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఆ హీరో ఎవరనే దాని మీద ఇండస్ట్రీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా స్టార్ హీరోపక్కన సాయి పల్లవి ఛాన్స్ వద్దనేసుకుని ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది