మూడు రోజులు క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయింది. దర్శక ధీరుడు రాజమౌళి పోస్ట్ చేసిన ఫొటోకు విపరీతమైన స్పందన వచ్చింది. రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి తారక రామరావు ముగ్గురు కలిసి దిగిన ఫోటో సెన్సేషన్ కి దారి తీసింది.
అయితే రాజమౌళి పెట్టిన ఆ ఫొటోకు సోషల్ మీడియాలో... ఎన్టీఆర్ - చెర్రీ ముల్టీస్టారర్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నాడని రుమర్స్ వచ్చి తెగ కన్ఫ్యూజ్ చేసాయి. కానీ చాలా మంది అది నిజమేనని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇంకొంతమంది ఇందులో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. అయితే ఎన్టీఆర్ - చెర్రీ ముల్టీస్టారర్ కచ్చితంగా ఉంటుందని ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ క్లారిటీ ఇచ్చింది.
ఆ ఛానల్ లో ప్రసారం అయ్యే ఏది వైరల్ ఏది రియల్ అనే ప్రోగ్రాంలో ఆ ఛానల్ వారు నందమూరి - మెగా ముల్టీస్టారర్ ఉంటుందని కన్ఫర్మ్ చేసింది. అలాగే రాజమౌళి ఈ ముల్టీస్టారర్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడని ఆ ఛానెల్ వారు చెబుతున్న మాట. మరి నిజంగా ఇదే నిజమైతే ఈ ముల్టీస్టారర్ సినిమాకి బాహుబలి కన్నా ఎక్కువ క్రేజ్ వచ్చే అవకాశం పుష్కలంగా కనపడుతుంది.