ధైర్యం చేస్తుందంటారా..?

Update: 2017-07-13 09:25 GMT

టాలీవుడ్ లో కాజల్ పనైపోయిందని అనుకున్నోళ్లకి ఖైదీ నెంబర్ 150 తో నోరుమూపించిన కాజల్... తాజాగా నేనే రాజు - నేనే మంత్రి మూవీలో రానా కి జోడిగా నటిస్తుంది. తెలుగులో మంచి జోరు చూపిస్తున్న కాజల్ ఇప్పుడు తాజాగా.. తమిళ సీనియర్‌ దర్శకుడు పి. వాసు సినిమాలో నటిస్తున్నట్లు చెబుతున్నారు. పి.వాసు అంటే తమిళంలోని అందరు స్టార్స్‌తో పాటు బాలకృష్ణతో కూడా ఆయన చిత్రం తీశాడు. ఇక ఆయన కాన్సెప్ట్‌ మూవీస్‌ని తీస్తూ తనదైన కమర్షియల్‌ హంగులు అద్దడంలో దిట్ట. ఈ విషయం 'చంద్రముఖి' చూసిన వారికి అర్దమవుతుంది.

ఆ చిత్రంలో లీడ్‌రోల్‌ జ్యోతికదే అయినా రజనీకాంత్‌, ప్రభు, నయనతారలను ఆయన చూపించిన విధానం అద్బుతం. అయితే ఆయన ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్‌ కాన్సెప్ట్‌ మూవీని తీయాలని భావిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీలలో కూడా రిలీజ్‌చేసే ఉద్దేశ్యం ఉండటంతో మన చందమామ కాజల్‌ని కలసి స్టోరీలైన్‌ వినిపించాడట. కథ అద్భుతంగా ఉన్నప్పటికీ ఇప్పుడే లేడీ ఓరియంటెడ్‌ మూవీలలో చేస్తే తాను ఫేడవుట్‌ అయ్యానని అందరూ అనుకునే ప్రమాదం ఉందనే ఆలోచనలో కాజల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌, కోలీవుడ్‌ల పరిస్థితి వేరైనా టాలీవుడ్‌లో మాత్రం హీరోయిన్లు ఫేడవుట్‌ అయ్యే సమయాలలోనే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తారనే అపోహ ఉంది.

కానీ తమిళంలో నయనతారలాగా, లేదా బాలీవుడ్‌లో కంగనారౌనత్‌, విద్యాబాలన్‌, ఐశ్వర్యారాయ్‌ వంటి వారు కూడా మంచిపీక్‌లో ఉన్నప్పుడే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేసి మెప్పించారు. వాస్తవానికి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలలో అవకాశం రావడమంటే తమ నటనను దక్కిన గౌరవంగా భావించాల్సింది పోయి... ఇలా చెడ్డగాచూడటం ఎందుకో...? గతంలో శారద, విజయశాంతి,నేటి అనుష్కలు ఇటు లేడీ ఓరియంటెడ్‌చిత్రాలతోపాటు గ్లామర్‌ పాత్రల్లో కూడా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరి కాజల్ కూడా ఈ సినిమాని ఒప్పుకుని ధైర్యంతో ముందడుగు వేస్తుందో లేకుంటే సైలెంట్ గా హాట్ హాట్ గా హీరోయిన్ వేషాల కోసమే వెయిట్ చేస్తుందో వెయిట్ అండ్ సి.

Similar News