ధరమ్.. ఇప్పుడు ధర్మాభాయా...?

Update: 2017-12-15 08:00 GMT

సాయి ధరమ్ తేజ కి వరుస పరాజయాలు బాధిసున్నాయి. కాకపోతే తాజాగా జవాన్ తో యావరేజ్ హిట్ ని అందుకున్న సాయి ధరం తేజ్ తన తదుపరి మూవీ ని వినాయక్ దర్శకత్వం లో ఎలాగైనా హిట్ కొట్టి మాస్ హీరో అనిపించుకోవాలని కసితో ఉన్నాడు. సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ శర వేగంగా సాగుతుంది. ఇంతవరకు వినాయక్ - సాయి ధరమ్ తేజ్ సినిమాకి టైటిల్ గా దుర్గా అని ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు ఈ మూవీ కి ధర్మ భాయ్ అనే టైటల్ పెట్టె ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది.

సాయి ధరం తేజ్ లోని ధరం కి పోలిక ఉండేలా ఈ మూవీ కి ధర్మ భాయ్ అనే టైటల్ అయితే బావుంటుందని... ఆలోచిస్తున్నారట. సినిమాలో యాక్షన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ అయితే ఈ కథకి సరిగ్గా సరిపోతుందని చిత్ర బృందం కూడా భావిస్తోందట. అయితే దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో సాయి ధరం తేజ్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల డేట్ లాక్ చేశారు.

Similar News