అర్జున్ రెడ్డి సినిమా తో రాత్రికి రాత్రే స్టార్ హీరో అవతారమెత్తాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ జాతకమే మారిపోయింది. మనోడు షాప్ ఓపెనింగ్స్, బ్రాండ్ అంబాసిడర్లు, స్పెషల్ ఫోటో షూట్స్... అబ్బో ఒకటేమిటి అన్నిటిలోను విజయ్ దేవరకొండ చెలరేగిపోతున్నాడు. మరోపక్క టాప్ ప్రొడ్యూసర్స్ సైతం విజయ్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టార్ ప్రొడ్యూసర్స్ బ్యానర్ లో మూవీస్ చేస్తూ బిజీ గా ఉన్నాడు.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఇప్పుడు తాజాగా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అని తెలుస్తుంది. కేవలం ఆ సినిమాకి నిర్మాతగా మాత్రమే కాదు ఈ సినిమాలో హీరో కూడా విజయ దేవరకొండేనట. అవును విజయ్ తోలి మూవీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ మూవీ దర్శకత్వం వహిస్తాడంట. ఇప్పటికే శేఖర్ కమ్ముల - విజయ్ దేవరకొండ కలయికలో ఒక మూవీ మొదలు కాబోతుందనే టాక్ వుంది. ఇటీవలే విజయ్ కు ఒక కథ చెప్పాడట శేఖర్. కథ నచ్చిన వెంటనే విజయ్ మూవీ చేస్తాను అని చెప్పాడట. అయితే విజయ్ దేవరకొండ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాని చెయ్యబోతున్నాడట.
అలాగే ఈ ఒక్క మూవీ మాత్రమే కాదు ఇంకా ముందు ముందు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేస్తాడని తెలుస్తుంది. తన లాగ ఇండస్ట్రీ లో ఏ ఒక్క టెక్నీషియన్ అవకాశాలు లేక ఆగిపోకుడదు అని చెప్పి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ విజయ్ దేవరకొండ మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తాడట. మరో పక్క నాచురల్ స్టార్ నాని కూడా ఇలా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. కాకపోతే అందులో నాని హీరోగా చేయడంలేదు. కేవలం సినిమాని మాత్రమే నిర్మిస్తున్నాడు. అయితే ఇక్కడ విజయ్ హీరోగా, నిర్మాతగా చేస్తున్నాడన్నమాట.