దేనికైనా తెగింపు ముఖ్యం!!

Update: 2017-08-01 03:51 GMT

నాగ చైతన్య ఇప్పుడు లవర్ బాయ్ నుండి మళ్లీ మాస్ వైపు పరిగెడుతున్నాడా?. ఏమో 'యుద్ధం శరణం' టీజర్ చూస్తుంటే అలాగే కనబడుతుంది. కొన్ని రోజుల నుండి ప్రేమ కథా చిత్రాలతో వరుస హిట్స్ అందుకుంటున్న నాగ చైతన్య ఈసారి కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఒక థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. డైరక్టర్ కృష్ణ మరిముత్తు డైరక్షన్లో 'యుద్ధం శరణం' చిత్రంలో నటిస్తున్న నాగ చైతన్యకి జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసింది చిత్ర టీమ్.

ఈ టీజర్ లో 'మనం బ్రతకాలంటే.. వాడికి ఎదురెళ్ళాలి. ఇది ధైర్యం కాదు. తెగింపు' అంటూ నాగ చైతన్య చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ సినిమా కథ ఏమిటనేది కాస్త క్లారిటీ ఇచ్చేసాడు. ఇందులో నాగ చైతన్య యాక్షన్ లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది. టీజర్ మొత్తం సీరియస్ గా కొంచెం స్టైలిష్ గా వుంది. ఇందులో నాగ చైతన్య లుక్, లావణ్య త్రిపాఠి సూపర్ హాట్ లుక్... రేవతి ఎక్సప్రెషన్స్, అలాగే శ్రీకాంత్ విలన్ గా ... విలన్ అంటే ఇలాగే ఉండాలనే ఎక్సప్రెషన్స్ తో ఇరగదీస్తున్నాడు. మరి ఇన్ని ప్లస్ లు కనబడుతున్న ఈ యుద్ధం శరణం చిత్రం టీజర్ మాత్రం డిఫరెంట్ స్టయిల్లో అదిరిపోతుందనే చెప్పాలి.

ఇక ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ బ్యాగ్రౌండ్ స్కోర్. 'పెళ్ళి చూపులు' ఫేం వివేక్ సాగర్ యుద్ధం శరణం కి మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఒక కొత్త దర్శకుడు ఒక్క టీజర్ తోనే ఇంత కొత్తగా ఆకట్టుకుంటున్నాడు అంటే మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మొదటిసారి జోడి కడుతున్న నాగ చైతన్య - లావణ్య త్రిపాఠిల రొమాన్స్ ఎలా వుండబోతుందో అనేది కొంచెం ఆసక్తికలిగించే అంశమే.

Similar News