ఆగష్టు 11 న ఐదురోజుల వరుస సెలవులను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో సినిమా వసూళ్ల గురించి అస్సలాలోచించకుండా పోటీకి దిగిన 3 క్రేజీ మూవీస్ 'నేనే రాజు నేనే మంత్రి, జయ జానకీ నాయక, లై' చిత్రాల తోలి మూడు రోజులు బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్షన్స్ సాధించి ఏ సినిమా ముందంజలో ఉందొ..... ఏ సినిమా వెనకబడిందో చూద్దాం. తొలిమూడురోజుల వసూళ్ళలో 'నేనే రాజు నేనే మంత్రి' ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే 'జయ జానకీ నాయక , లై' చిత్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. 'నేనే రాజు నేనే మంత్రి,జయ జానకీ నాయక' చిత్రతో పోలిస్తే 'లై' మూవీ బడ్జెట్ బిజినెస్ కు తగ్గ ఓపెనింగ్స్ కలెక్ట్ చేయడంలో కాస్త వెనుకంజలో ఉందంటున్నారు. అయితే కొత్త సబ్జెక్టు తో ఈ చిత్రం లాంగ్ రన్ లో ఈలోటు భర్తీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే మాస్ ఎంటర్టైనర్ 'జయజానకి నాయకా' 3 వ స్థానానికి పడిపోయే ఛాన్స్ కూడా ఉందని ఎగ్జిబిటర్స్ టాక్. ఇక ఓవర్సీస్ లో మూడు సినిమాలూ ఆశించిన వసూళ్లు రాబట్టలేదని తెలుస్తోంది.
ఇక' రాజు మంత్రి, జయ జానకి, లై' సినిమాల 3 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి.
నేనేరాజు - నేనే మంత్రి
నైజాం 3 కోట్ల 44 లక్షలు
సీడెడ్ 1.20 కోట్లు
ఉత్తరాంధ్ర 1.15 కోట్లు
ఈస్ట్ 79 లక్షలు
కృష్ణ 65 లక్షలు
గుంటూరు 62 లక్షలు
వెస్ట్ 40 లక్షలు
నెల్లూరు 28 లక్షలు
టోటల్ ఏపీ - తెలంగాణ 8. 53 కోట్లు
అమెరికా 1.16 కోట్లు
కర్ణాటక 72 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా అబ్రాడ్ 45 లక్షలు
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 10 కోట్ల 86 లక్షలు
జయ జానకీ నాయక
నైజాం 2.56 కోట్లు
సీడెడ్ 1.45 కోట్లు
ఉత్తరాంధ్ర 1.16 కోట్లు
గుంటూరు 85 లక్షలు
ఈస్ట్ 58 లక్షలు
వెస్ట్ 55 లక్షలు
కృష్ణ 44 లక్షలు
నెల్లూరు 44 లక్షలు
టోటల్ ఏపీ - తెలంగాణ 8. 03 కోట్లు
ఓవర్సీస్ 1.10 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 9. 13 కోట్లు
అయితే చివరిగా 'లై' .. సుమారు 8 కోట్లు షేర్ సాధించి వెనుకంజలో ఉందని చెబుతున్నారు.