ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికే టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇండస్ట్రీలో ఉన్న చితక చితక హీరోలందరితోనే కాక పెద్ద పెద్ద హీరోలందరితో జోడికట్టిన రకుల్ కి ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. గత ఏడాది ఆఖరిలో 'ధ్రువ' తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రకుల్ కి ఈ ఏడాది నాగ చైతన్యతో కలిసి నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' తప్ప మరొక హిట్ లేదు. ఆగస్టు లో విడుదలైన 'జయ జానకి నాయక' హిట్ అన్నప్పటికీ కలెక్షన్స్ వీక్ గా ఉండటం తో సినిమా కూడా ఫట్ అన్నారు. తాజాగా దసరా బరిలో విడుదలైన 'స్పైడర్' సినిమా కూడా ఆశించిన విజయం రకుల్ కి అందించలేదు.
'స్పైడర్' చిత్రంతో తమిళంలో కూడా పాగా వెయ్యాలని కలలు కన్న రకుల్ కి అక్కడ ఎదురు దెబ్బతగిలింది. మురుగదాస్ దర్శకత్వంలో నటించాలనే కోరిక 'స్పైడర్' తో తీరినా.. ఆ సినిమా ఇచ్చిన ఫలితంతో రకుల్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. అసలు 'స్పైడర్' సినిమాలో రకుల్ నటన బాగోలేదని విమర్శలొచ్చాయి. డాక్టర్ పాత్రలో రకుల్ తేలిపోయిందన్నారు. అలాగే సినిమాలో తనకి ఎలాంటి కేరెక్టర్ వస్తుందో అని ఆలోచిందకుండా పెద్ద బ్యానర్, పెద్ద హీరో అని మాత్రమే చూసుకుని సినిమాలు ఒప్పేసుకుంటుందనే విమర్శలు కూడా రకుల్ మీదున్నాయి.
ఇప్పటివరకు ఫుల్ బిజీగా సాగిన ఆమె కెరీర్ ఇప్పుడు ఒక్కసారిగా డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతానికి రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో ఎలాంటి స్టార్ హీరో సినిమా లేదు. కేవలం ఒక తమిళ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలో మాత్రమే రకుల్ యాక్ట్ చేస్తుంది. తెలుగులో మాత్రం ఎటువంటి ప్రాజెక్ట్ ఆమె చేతిలో లేదు. మరి ఈ దెబ్బకి రకుల్ కెరీర్ పరిస్థితి ఏమవుతుందో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు