రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 చిత్రంలో హీరోయిన్ అమీ జాక్సన్ యమా కాస్ట్లీ అంటున్నారు. ఆమెని దేనికోసమైన కదిపిస్తే కోట్లడుగుతుందట. ఇప్పుడు 2.0 లో హీరోయిన్ గా నటిస్తున్న అమీ ఓవర్ నైట్ లో మంచి స్టార్ డమ్ కొట్టేసింది. సౌత్ లో శంకర్ సినిమాలకున్న క్రేజ్ మామూలుది కాదు. అందుకే ఈ సినిమాలో నటిస్తున్న అమీ జాక్సన్ తనతో పనిచెయ్యయాలని ఆశపడుతున్నోళ్లకి చుక్కలుచూపిస్తుందట. అమీ జాక్సన్ తో ఒక కార్పొరేట్ సంస్థ ఒక డీల్ కూర్చుకోవడానికి రెడీ అయ్యిందట.
ఆ కార్పొరేట్ సంస్థ అమీ జాక్సన్ తో తమ ఉత్పత్తుల పబ్లిసిటీ కోసం ఒకే ఒక్క కాల్షీట్ అడిగిందట. ఆ కాల్షీట్ కూడా కేవలం ఆరు గంటలకోసమేనట. అయితే ఆ కార్పొరేట్ సంస్థ ఆ ఆరు గంటల కాల్షీట్ లోనే ఒక ఫోటో షూట్ కి ప్లాన్ చేసి తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకోవాలనుకుందట. ఇక ఆ ఒక్క కాల్షీట్ కి అమీ జాక్సన్ కి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి మరి డీల్ సెట్ చేసుకోవాలనే ఆశతో ఆమెని కలవగా ఆమూడు కోట్ల రూపాయలతో పాటే ఆ ఫోటోషూట్ కోసం అక్షరాలా కోటి రూపాయలు సదరు కార్పొరేట్ సంస్థని అమీ డిమాండ్ చేసిందట.
అప్పటికే మూడు కోట్ల డీల్ ఎక్కువని వారనుకుంటుంటే మళ్ళీ అమీ అడిగిన కోటి రూపాయలకు వారు తెల్లమొహం వేసి కాసేపటికిగాని తేరుకోలేకపోయారట. దేబ్బకీ కళ్ళు బైర్లు కమ్మే రెమ్యునరేషన్ అడిగిందట అమీ జాక్సన్. అసలు అమీ ఏం చూసుకుని అలా రెచ్చిపోతుందో గాని ఆమెకి రజినీకాంత్ 2.0 సినిమా తప్ప మరే ఇతర సినిమా కూడా చేతిలో లేదు. ఇలాంటి టైం లో అమీ జాక్సన్ అంత డబ్బు డిమాండ్ చేస్తుంది అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాలనే ఆలోచనలో అమీ వుందన్నమాటేగా.