టాలీవడ్ లో మరో మాస్ మసాలా దర్శకుడు వివివి వినాయక్. ఆయన తీసిన దిల్ చిత్రం నుండి నిన్న మొన్నటి ఖైదీ నెంబర్ 150 చిత్రం వరకు పక్కా మాస్ మసాలా చిత్రాలే కావడం విశేషం. అయితే చిరుని రీ లాంచ్ చేసిన వినాయక్ ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరోసారి మెగా హీరోనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఖైదీ తర్వాత వినాయక్ తన తదుపరి చిత్రాన్ని మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో చేస్తున్నాడు.
అసలైతే ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభంకావాల్సి ఉన్నా కూడా సినిమా బడ్జెట్, వినాయక్ రెమ్యూనరేషన్‌ల విషయం వల్ల కాస్త ఆలస్యమైందని సమాచారం. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జిలు ఆల్‌రెడీ మెగా హీరోలైన సాయితో 'విన్నర్', వరుణ్‌తేజ్‌తో 'మిస్టర్' నిర్మించి దారుణంగా నష్టాలు చవిచూశారు. దాంతో వారే నిర్మించే సాయిధరమ్‌తేజ్ - వినాయక్‌ల చిత్రం బడ్జెట్, వినాయక్ పారితోషికంగా పలు విషయాలు పెండింగ్‌లో పడ్డాయట. మొత్తానికి ఈ కాంబినేషన్ ఇప్పటికి ఓకే అయినట్లు తెలుస్తోంది.
ఇక తనకు ఈ మద్య వచ్చిన గ్యాప్‌లో సాయికి తగ్గ సబ్జెక్ట్‌ని కూడా వినయ్ దాదాపు ఫైనల్ చేశాడట. మరి వినయ్ అంటే భారీ లెవల్లో హీరోయిజం ఉంటుంది. అయితే సాయి ధరమ్ తో వినయ్ చేసే చిత్రానికి 'దుర్గ' అనే టైటిల్ ని నిర్మాతలు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారని వార్తలొస్తున్నాయి. ఇక ఈ టైటిల్ ని చూస్తుంటే ఇది పక్కా మాస్ చిత్రమనే అనిపిస్తుంది. మరి ఎన్టీఆర్ కి 'ఆది' వంటి పవర్ ఫుల్ హిట్ ఇచ్చిన వినాయక్ ఇప్పుడు సాయి కూడా 'దుర్గ' తో ఎంతటి హిట్ ఇస్తాడో అని మెగా అభిమానులు అప్పుడే తెగ ఇదైపోతున్నారు