దీపికాతో ఢీ అంటున్న రకుల్ ప్రీత్!

Update: 2018-01-21 09:00 GMT

వెంకటాద్రి ఎక్సప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో పాతుకుపోయింది రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులు చవిచూసినప్పటికి ఈ ఢిల్లీ బ్యూటీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. గత రెండేళ్లలో వరస హిట్స్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత హిందీ లో యారియాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత మల్లి టాలీవుడ్ లోకి వచ్చేసి వరస హిట్స్ అందుకుంది. మల్లి ఇప్పుడు దాదాపు నాలుగేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు హిందీలోకి రీఎంట్రీ ఇచ్చింది. అయ్యారి అనే పాలిటికల్ థ్రిల్లర్ లో రకుల్ ప్రీత్ బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తో జంట కట్టబోతోంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9వ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ మూవీ మేకర్స్ ఈ సినిమా జనవరి 26 న విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ దానికి ముందు రోజే జనవరి 25 న దీపికా పదుకొనె టైటిల్ రోల్ లో నటించిన పద్మావతి రిలీజ్ అవుతుంది. మరి ప్రముఖ హీరోయిన్ అయిన దీపికా ధాటికి రకుల్ నిలబడగలదు అంటారా? వేచి చూడాల్సిందే..

Similar News