దీనితో ఎండ్ కాలేదంటున్నాడు!!

Update: 2017-07-11 05:00 GMT

తమిళంలో ధనుష్ డైరెక్టర్ గాను, నిర్మాతగానూ, హీరోగానూ దూసుకుపోతున్నాడు. కేవలం రజినీకాంత్ కి అల్లుడుగా కాకుండా తనకంటూ మంచి ఇమేజ్ ని సంపాదించుకుని స్టార్ స్టేటస్ ని అనుభవిస్తున్నాడు ధనుష్. తమిళంలో విఐపి చిత్రంలో నటించిన ధనుష్ కి ఆ చిత్రం సూపర్ హిట్ నిచ్చింది. ఆ హిట్ విఐపి కి సీక్వెల్ గా విఐపి 2 ని తన భార్య సిస్టరయిన సౌందర్య డైరెక్షన్ లో తెరకెక్కించాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కాజల్ విలన్ పాత్రలో మురిపిస్తుంది. విఐపి చిత్రం తెలుగులో రఘువరన్ బిటెక్ గా విడుదలై మంచి విజయం సాధిచింది. ఇక విఐపి 2 ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నాడు ధనుష్.

ఈ విఐపి 2 చిత్రం ఈ నెల 28 న విడుదల కాబోతుంది. అయితే సినిమా ప్రమోషన్ లో భాగంగా ధనుష్ విఐపి 2 స్టోరీని సీక్వెల్‌తో ముగించలేదని.... తప్పకుండా 3, 4 భాగాలు కూడా వస్తాయని క్లారిటీ ఇచ్చేశాడు. ఫస్ట్‌ పార్ట్‌తో పోల్చితే రెండోది మరింత భిన్నమైనదని... అలాగే విఐపి పార్ట్ 3 లోను కాజల్ నటిస్తుందని క్లారిటీ ఇచ్చేసాడు. మరి ఫస్ట్ పార్ట్ ని వేల్‌రాజ్‌ డైరెక్ట్ చేయగా... ఇప్పుడు విఐపి పార్ట్ 2 ని సౌందర్య డైరెక్ట్ చేసింది. ఇక పార్ట్ 3 డైరెక్టర్ సంగతి, అమల పాల్ పార్ట్ 3 లో నటిస్తుంది అన్న సంగతి మాత్రం ధనుష్ వివరణ ఇవ్వలేదు.

Similar News