దిల్ రాజుకి షాకిచ్చిన నిర్మాతలు

Update: 2017-12-14 04:57 GMT

ఇండస్ట్రీ లో దిల్ రాజు ఒకపక్క నిర్మాతగా కొనసాగుతూనే మరోపక్క తన డిస్ట్రిబ్యూషన్ ని ఒదిలి పెట్టడం లేదు. పెద్ద సినిమాల నైజాం హక్కులను తన చెయ్యి దాటిపోకుండా ఒడిసి పట్టుకుంటాడు. అలాగే నిర్మాతగా దిల్ రాజు సినిమా రిలీజ్ అవుతుంది అంటేనే చాలు చాలా మంది తమ తమ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటారు. అయితే అలాంటి నిర్మాత ఇప్పుడొక సినిమా నిర్మాతల విషయంలో భయపడ్డాడట. దిల్ రాజు భయపడింది ఏ సినిమా నిర్మాతలకు తెలుసా.... దిల్ రాజు భయపడి వెనక్కి తగ్గింది రంగస్థలం నిర్మాతలకి అట.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ - సుకుమార్ ల కలయికలో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా పై ట్రేడ్ వర్గాలలో భారీ క్రేజ్ ఏర్పడటంతో ఆ చిత్రాన్ని నైజాం లో రిలీజ్ చేయాలని ముందుకు వచ్చాడు దిల్ రాజు. అయితే ఆ సినిమా నైజాం హక్కుల కోసం మైత్రి మూవీస్ చెప్పిన రేటు చూసి దిల్ రాజు భయపడ్డాడట. రంగస్థలం నైజాం హక్కుల కోసం మైత్రి మూవీస్ వారు ఏకంగా 20 కోట్లు చెల్లించాలని చెప్పారట. అయితే ఆ రేట్ విని షాక్ అయ్యి దిల్ రాజు సైలెంట్ అయ్యాడట.

అలా దిల్ రాజు సైలెంట్ అవ్వడం తో ప్రభాస్ నిర్మాతలు అయిన యువి క్రియేషన్స్ ముందుకు వచ్చి 18 కోట్లకు బేరం కుదుర్చుకొని రంగస్థలం నైజాం హక్కులను సొంతం చేసుకున్నారట. రామ్ చరణ్ సినిమాకు ఒక్క నైజాం రేటు 18 కోట్లు అంటే చాలా ఎక్కువ అయినప్పటికీ ప్రభాస్ నిర్మాతలు ధైర్యం చేసి నైజాం లో రంగస్థలం హక్కులు కొనేసి.. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇకపోతే రంగస్థలం మూవీ ఓవర్సీస్ లో కూడా భారీ బిజినెస్ చేస్తుందని అనుకుంటున్నారు నిర్మాతలు.

Similar News