దిల్ రాజు సేఫ్ గేమ్

Update: 2017-12-08 05:04 GMT

పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న బయ్యర్లకు చేదు అనుభవం మిగిల్చాయి. ఈ ఏడాది రిలీజ్ అయినా 'స్పైడర్’.. ‘కాటమరాయుడు’.. ‘డీజే’.. ‘జై లవ కుశ’ లాంటి సినిమాలు బయ్యర్లకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా 'స్పైడర్’.. ‘కాటమరాయుడు’ సినిమాలు దారుణ ఫలితాన్నందుకోగా.. ‘డీజే’.. ‘జై లవ కుశ’ మాత్రం పర్వాలేదనిపించాయి కానీ.. అవి కూడా కొంత మేర బయ్యర్లకు నష్టాలే తెచ్చిపెట్టాయి.

ఎంత నష్టం వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో టెంప్ట్ అవక తప్పట్లేదు. కాంబినేషన్ క్రేజ్ చూసి సినిమాను కొని నష్టపోతుంటారు. ఈ వలలో టాప్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏడాది రిలీజ్ అయినా ‘జై లవ కుశ’ కూడా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని రాజు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అందుకే రాజు చిన్న-మీడియం సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఆయన ‘తొలి ప్రేమ’.. ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాల్ని భారీ రేట్స్ కి కొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో వరుణ్ తేజ నెక్స్ట్ మూవీ భారీ అంచనాలు ఉండటంతో ‘తొలి ప్రేమ’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ.18 కోట్లకు తీసేసుకున్నాడట రాజు. ఇంకా నాని మంచి ఫామ్ లో వున్నాడు గనుక అతడి సినిమా రూ.23 కోట్లు తీసుకున్నాడట దిల్ రాజు. వీళ్లిద్దరి ఫామ్ లో వున్నారుగనుక ఈ సినిమాలు ఓపెనింగ్ కూడా అదే స్థాయిలో ఉండేఅవకాశం లేకపోలేదు. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నెలల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Similar News