దిల్ రాజు తన బ్యానర్ నుండి చాలా మంది కొత్త డైరెక్టర్స్ ను పరిచయం చేసాడు. ఆ బ్యానర్ నుండి బయటికి వెళ్ళగానే వాళ్ళు చాలా సక్సెస్ అయ్యి పెద్ద డైరెక్టర్స్ కూడా అయ్యారు. సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, బోయపాటి శ్రీను, వంశీ పైడిపల్లి..ఇలా ఎంతో మందికి దిల్ రాజు లైఫ్ ఇచ్చాడు. వంశీ పైడిపల్లి ఫస్ట్ సినిమా మున్నా సక్సెస్ కాలేదుగాని తర్వాత వచ్చిన బృందావనం, ఎవడు సినిమాలతో హిట్లు కొట్టించి ఆ తర్వాత బయటికి వదిలాడు దిల్ రాజు.
అలానే తర్వాత వచ్చిన వేణు శ్రీరామ్ ను కూడా వదల్లేదు. దిల్ రాజు బేనర్లో ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు వేణు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినా గాని అతన్ని నమ్మి అతడితోనే ఎంసీఏ తీశాడు. ఇది కమర్షియల్‌గా ఎంత సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు.
అయితే రెండు సినిమాతో హిట్ కొట్టిన వేణుని దిల్ రాజు వదల్లేదు. తన బ్యానర్ లో ఇంకో సినిమా కూడా చేయాలని దిల్ రాజు చెప్పారని అందుకు నేను ఓకే చెప్పేసానని వెల్లడించాడు వేణు. ఓ మై ఫ్రెండ్ ఆడకపోయినా.. తన మీద నమ్మకంతో మళ్లీ అవకాశమిచ్చిన దిల్ రాజుకు రుణపడి ఉంటానని అన్నాడు. ఓ మై ఫ్రెండ్ కాన్సెప్ట్‌ను జనాలు ఆమోదించలేదని..ఎంసీఏ సినిమాలో వదిన - మరిది బంధం తాలూకు సన్నివేశాలన్నీ తన జీవితం నుంచి తీసుకున్నవే అని అతనన్నాడు. ఈ సినిమా మేము అనుకున్నదానికంటే పెద్ద విజయం సాధించిందని వేణు చెప్పాడు.