దిల్ రాజు ఫీల్ అవుతున్నాడట

Update: 2017-12-26 14:36 GMT

ఫిదా సినిమాతో తెలంగాణ యాసలో సాధారణ ప్రేక్షకులని కాదు సినీ క్రిటిక్స్ ని కూడా ఫిదా చేసింది సాయి పల్లవి. న్యాచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి 'ఎంసీఏ'లో న‌టించింది. దీంతో, ఆ సినిమాలో కూడా సాయి ప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ ఫిదా రేంజ్ లో కాక‌పోయినా...ఓ మోస్త‌రుగా ఉంటుంద‌ని ప్రేక్ష‌కులు ఊహించుకున్నారు.

అయితే 'ఎంసీఏ' కథ మొత్తం నాని - భూమిక మధ్యే జరగడం..సాయి పల్లవి - నాని మధ్య లవ్ సీన్స్ ఎక్కువ లేకపోవడంతో సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం ఉందని దిల్ రాజు భావిస్తున్నాడట. నాని-సాయి ప‌ల్ల‌వి ల మ‌ధ్య నాలుగు రొమాంటిక్ సీన్ల‌ను దిల్ రాజు లేపేయ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

డబల్ హాట్ ట్రిక్ కొట్టేశామ‌ని దిల్ రాజు చెబుతున్నా.. లోలోప‌ల మాత్రం ఎంసీఏ క‌లెక్ష‌న్ల‌పై కొద్దిగా అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. సినిమాలో నాని - భూమిక మధ్య సీన్స్ హైలైట్ అవుతాయని దిల్ రాజు భావించారట. అందుకే నాని - సాయిపల్లవి మధ్య గల నాలుగు రొమాంటిక్ సీన్స్ క‌ట్ చేశార‌ట‌. అయితే వీరిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటే బాగుండేద‌నే టాక్ వ‌చ్చింద‌ట‌. ఆ సీన్స్ ఉంటే ఎంసీఏకు మ‌రింత కిక్ వ‌చ్చేద‌ని.... కలెక్షన్స్ కూడా బాగానే వచ్చేవని దిల్ రాజు ఫీలవుతున్నారట. అయితే, చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్లు ఇపుడు ఆ సీన్స్ ను యాడ్ చేస్తారా....లేక అలాగే వ‌దిలేస్తారా అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

Similar News