దాని కోసం భారీగా ఖర్చు పెడుతున్నాడు

Update: 2017-08-20 10:51 GMT

జనాల చేతుల్లో ఫోన్ వుంది అంటే చాలు పక్కనోళ్లు ఏమైపోతున్న పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. ఫోన్ లో వాట్స్ అప్ లు, ఫేస్ బుక్ లో తలకాయలు పెట్టేసి బయట ప్రపంచాన్ని వదిలేస్తున్నారు. ఇక కంప్యూటర్స్ లో కూడా ట్విట్టర్, ఫేస్ బుక్ కి ఉన్న రేంజే వేరు. అసలు మనుషులతో కంటే ఎక్కువగా బొమ్మలతో మాట్లాడుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు చాలామంది. అయితే ఇదివరకు మాములుగా యాహూ మెయిల్ ఆర్కూట్ లలో ఎమోట్ ఐకాన్స్ ఉండేవి. వాటికంటే ఇప్పుడు వాట్సాప్ లో ఉన్న ఎమోటైకాన్స్ భలే క్లిక్ అయ్యాయ్. మరి పోటీని తట్టుకోవాలంటే ట్విట్టర్లో ఫేస్ బుక్లో కొత్త కొత్త బొమ్మలతో రకరకాలు ఎమోజీలను దించాలికదా ... అందుకే ఇప్పుడు అందరూ అదే పనిలో బిజీగా వున్నారు.

ఇక ఇప్పుడు కొత్తగా సినిమా హీరోలు కూడా రకరకాలు ఎమోజీలను తయారు చేసి వదులుతున్నారు. ఇలా ఎమోజీలను తయారు చేసినందుకు గాను ట్విట్టర్ వారికి కొంత ఎమౌంట్ పే చెయ్యాల్సి ఉంటుంది కూడా. మొన్నామధ్యన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 'ట్యూబ్ లైట్' సినిమా రిలీజ్ సందర్భంగా తన బొమ్మనే ఒక ఎమోజీగా రూపొందించి విడుదల చేయించాడు. అలాగే తమిళ్ హీరో విజయ్ కూడా 'మెరిసాల్' సినిమా కోసం సల్మాన్ ఖాన్ నే ఫాలో అవుతున్నాడు. మరి ఈరకమైన పబ్లిసిటీని కేవలం ఆ హీరోలు మాత్రమే చేస్తే మజా ఏముంటుంది అందుకే ఇప్పుడు అదే బాటలో యంగ్ టైగర్ వచ్చి చేరాడు.

ఎన్టీఆర్ తన తాజా సినిమా 'జై లవ కుశ' విడుదల సందర్భంగా... 'జై లవ కుశ' సినిమాలోని మూడు క్యారక్టర్లనూ మూడు రకాల ఎమోజీలుగా రిలీజ్ చేయిస్తున్నాడట. మరి దీని కోసం భారీగానే ఖర్చు పెడుతున్నాడు ఎన్టీఆర్. దీని కోసం అయ్యే ఖర్చు అక్షరాలా 50 లక్షలు అంట. ఇంత ఖర్చు పెట్టినా ఈ తరహా ప్రచారం క్లిక్కయ్యి సినిమాకి మంచి క్రేజ్ వచ్చేస్తుందంటున్నారు. ఎందుకంటే టాలీవుడ్ లో ఈ తరహా పబ్లిసిటీకి ఎన్టీఆర్ కొత్తగా నాంది పలుకుతున్నాడు కాబట్టి క్లిక్కయ్యే అవకాశాలు ఎక్కువే అంటున్నారు.

Similar News