ఇటీవల కాలంలో ప్రముఖులు చాలామంది ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారం పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వివిధ రకాల రుచులు , సరికొత్త వాతావరణంతో ఎన్నో రెస్టారెంట్లు వినియోగదారులకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ జాబితాలో సందీప్ కిషన్, సురేందర్ రెడ్డి, నీరజ కోన, అల్లు అర్జున్ వంటివారెందరో ఉన్నారు.
తాజాగా ఇప్పుడు చిరంజీవి కోడలు , రాంచరణ్ భార్య ఉపాసన కూడా చిన్నపాటి ‘థియేటర్ కేఫ్’ ను తెరిచేసింది. ఇది మామూలు రెస్టారెంట్లలాగా కాదండోయ్... ఆసుపత్రి బయట కాసేపు హాయిగా సేదతీరే ప్రదేశం అన్నమాట. దీనికి ‘థియేటర్ కేఫ్’ అని నామకరణం చేసింది. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ బయట దీన్ని ఏర్పాటు చేసింది ఉపాసన. చిరుస్ ఫిల్టర్ కాఫీ, హైదరాబాదీ కేసర్ రోస్ టీ, లుఖ్మి చికెన్, లమాకాన్ వరల్డ్ ఫేమస్ సమోసా, మిర్చి బజ్జీ వంటివి ఇందులో లభించనున్నాయి. రేట్లు కూడా కాస్త తక్కువే ఉన్నాయి.
ఈరోజు శుక్రవారం డిసెంబర్ 1 మధ్యాహ్నం 2 గంటల నుండి ఈ కేఫ్ వినియోగదారులకు అందుబాటులోకి రానుందని ఉపాసన తెలిపింది. ప్రతీ రోజు ఈ కేఫ్ లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. వాటి షెడ్యూల్ కూడా పెట్టిసింది ఉపాసన.