ఈ సంవత్సరం ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో వెండితెరకు రీ ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. ఆ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. సుమారు 100 కోట్లు వసూళ్లు సైతం సాధించింది. ఆ తరువాత చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతుంది. పొల్లాచ్చి , హైదరాబాద్ , రామోజీ ఫిలిం సిటీ ప్రాంతాల్లో సెట్లు నిర్మించారు.
చిరంజీవి పుట్టినరోజున ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, టైటిల్ లోగో లాంచ్, నటీనటులు – సాంకేతిక వర్గం వివరాలు ప్రకటించారు. ఈ సినిమాకు మొదట సంగీత దర్శకుడిగా ఏ.ఆర్ రెహ్మాన్ ఎంపికవ్వగా.. రవి వర్మన్ ఛాయాగ్రాహకుడిగా పనిచేయడానికి ఒప్పుకున్నాడు. తాజాగా ఈ చిత్రం చిత్రీకరణ ఆలస్యమవుతుండడంతో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుండి ఛాయాగ్రాహకుడిగా రవి వర్మన్ తప్పుకోగా ఆ అవకాశం రత్నవేలుకు దక్కింది. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నుండి ఏ.ఆర్ రెహ్మాన్ కూడా తప్పుకున్నాడట. ఆ అవకాశం ఇప్పుడు తెలుగు సంగీత దర్శకుడు తమన్ కు దక్కిందని టాక్.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం మోషన్ పోస్టర్ కు సంగీతం తమన్ అందించాడనే విషయం అందరికి తెలిసిందే. ఆ మోషన్ పోస్టర్ మ్యూజిక్ కి గొప్ప స్పందన రావడంతో చిత్ర బృందం తమన్ కే ఈ చిత్రం సంగీతం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తుంది. ఈ వార్తల పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది…