అమ్మడు కూడా పెళ్ళికి సిద్దమేనా?

Update: 2018-04-03 08:55 GMT

ఈమధ్యన ఆఫర్స్ తగ్గిన సీనియర్ హీరోయిన్స్ అంతా పెళ్ళికి రెడీ అవుతున్నారు. కాకపోతే ఆ పెళ్ళిళ్ళని సీక్రెట్ గా దాచేస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ శ్రీయ శర్మ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. అయినా సినిమాలకు సై అంటుంది ఆ గ్లామర్ డాల్. ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా పెళ్ళికి రెడీ అవుతుంది. గత పదేళ్లుగా అందాల ఆరబోతతోనే కెరీర్ ని నెట్టుకొచ్చి.. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో తన హావాని కొనసాగిస్తున్న త్రిష కూడా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సినిమా ప్రపంచంలో పెళ్లి పేరు వినబడకుండా ఏళ్లతరబడి ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్స్ కొద్దిగా ఆఫర్స్ తగ్గగానే ఇలా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు.

టాలీవుడ్ లోను, కోలీవుడ్ లోను ఒకప్పుడు మంచి క్రేజ్ లో ఉన్న త్రిష కి ప్రస్తుతం చేతిలో ఆఫర్స్ లేవు. కొత్త హీరోయిన్స్ అందచందాలముందు ఈ ముదురు భామ అందాలు ఆనడం లేదు. అందుకే అమ్మడుకి ఆఫర్స్ తగ్గు మొహం పట్టాయి. గత రెండుమూడేళ్ళగా త్రిషకి ఆఫర్స్ లేవు. చిన్న చితక సినిమాల్తో బండి లాగుతున్న త్రిష పెళ్లి చేసుసుకుందామని డిసైడ్ అయ్యిందట. ప్రస్తుతం త్రిష రెండు వారాలుగా స్కాట్ ల్యాండ్.. అమెరికా అంటూ ట్రిప్పులు మీద ట్రిప్పులు కొడుతోంది. అయితే త్రిష మాత్రం ఖాళీ టైం దొరికింది కాబట్టి వెకేషన్ కి వెళుతున్నానని పైకి చెబుతున్నా కానీ... వరుడి వేటలో భాగంగా ఇలా టూర్ కు వెళ్లిందని తెలుస్తోంది.

అయితే బాయ్ ఫ్రెండ్ లేని త్రిష కోసం త్రిష కుటుంబ సభ్యులు... త్రిష రేంజ్ కు తగ్గట్టుగా అమెరికాలో రెండు మూడు సంబంధాలు చూశారట. అందుకే త్రిష కూడా ఇటు వెకేషన్ కి వెళ్లినట్టుగాను ఉంటుంది.. అటు పెళ్లికొడుకులను చూసి మంచి చెడులూ తెలుసుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ టూర్ ప్లాన్ చేసిందని కోలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల మీద దృష్టి పెట్టిన త్రిష, మోహిని అనే హర్రర్ సినిమాతో పాటు అరవింద్ స్వామి సరసన మరో మూవీలో నటిస్తుంది

Similar News