డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మొదటి సినిమా నుండి పెద్ద కాస్టింగ్ తీసుకోవడం అలవాటు. తన సినిమాలో హీరోతో పాటు కచ్చితంగా మరొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అందుకు ఉదాహరణ అత్తారింటికి దారేది - అ..ఆ సినిమాల్లో నదియా. అజ్ఞాతవాసిలో ఖుష్బూ ఇలాంటి సీనియర్ యాక్టర్స్ ని తెలుగు ప్రేక్షకులకు మల్లి పరిచయం చేసాడు త్రివిక్రమ్.
త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీలో కూడా ఓ లేడీ యాక్టర్ ను తిరిగి ప్రేక్షకులను పరిచయం చేయబోతున్నాడనే న్యూస్ ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తుంది. ఆ నటి స్వయంవరం సినిమా తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన లయ అని తెలుస్తోంది. సినిమాలు తగ్గుతున్న టైంలో లయ పెళ్లి చేసుకుని సినిమాలకు బైబై చెప్పేసింది.
మల్లి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ చెప్పిన కథకు లయ ఒప్పుకుని తిరిగి మేకప్ వేసుకోబోతుందని అని టాక్. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. దీనిపై త్వరలోనే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వనుంది.