త్రివిక్రమ్ సినిమాపై ఫుల్ క్లారిటీ

Update: 2017-09-19 16:00 GMT

తెలుగు సినిమా పరిశ్రమ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా జై లవ కుశ ముచ్చట్లే. ఏ ఛానల్ చూసినా, ఏ ప్రింట్ మీడియా చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జైలవకుశ ప్రమోషన్ తో ఎన్టీఆరే కనబడుతున్నాడు. ఈ సినిమా విడుదలవ్వగానే ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే జై లవ కుశ చిత్ర కథ అంతా అన్నదమ్ముల అనుబంధంతో తెరకెక్కిందనే విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతే సినిమా ఎలా ఉండబోతోంది.. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ ఎలా ప్రిపేర్ అవుతున్నాడు లాంటి అంశాలపై ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు తన నెక్ట్స్ సినిమాపై తారక్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

అసలు త్రివిక్రమ్ సినిమా గురించి ఇంకా ఏం అనుకోలేదు. అయితే త్రివిక్రమ్ చెప్పిన కథ ప్రకారం.. లుక్ ఇలా అయితే బాగుంటుందని ఒక లుక్ మాత్రం మనసులో అనుకున్నాను. దాని గురించి త్రివిక్రమ్ తో ఇంకా చర్చించలేదు కూడా. అయితే అంతాకలిసి ఒకసారి కూర్చున్న తర్వాత ఆ గెటప్ కోసం వర్కవుట్ చేస్తే సరిపోతుంది. ఇక త్రివిక్రమ్ సినిమా కోసం మలేషియా వెళ్లి నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాననే వార్తల్లో ఎలాంటి నిజం లేదని...... త్రివిక్రమ్ సినిమాకు మార్షల్ ఆర్ట్స్ కు కు అస్సలు సంబంధం లేదని చెప్పాడు తారక్.

ఇకపోతే ఎన్టీఆర్ లండన్ వెళ్లి డీ-టాక్సిఫికేష న్ చేయించుకుంటాడనే వార్తలో కూడా ఎలాంటి నిజం లేదంటున్నాడు తారక్. ప్రస్తుతానికి తనకు అంత అవసరం లేదని చెప్పుకొచ్చాడు.

Similar News