యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై లవకుశ సినిమా రిలీజ్ అయ్యి చాలా నెలలు అవుతుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో కొత్త సినిమా పూజ కార్యక్రమం జరిగి కూడా నెల కావొస్తుంది... కానీ ఆ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతం త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ హడావిడి లో బిజీగా వున్నాడు. జనవరి నెల ఆఖరికి ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు త్రివిక్రమ్. అయితే ఈ ఖాళీ సమయం అంతా ఎన్టీఆర్ బాగా లీజర్ గా గడిపేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు.
నిజానికి ఎన్టీఆర్ ఆలా ఖాళీగా లేడంట. త్రివిక్రమ్ సినిమా కోసం మళ్లీ మేకోవర్ కు ట్రై చేస్తున్నాడట. తొలిసారిగా త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూవీ కావడం.. అందునా ఫ్యామిలీ జోనర్ లో రూపొందే చిత్రం కావడంతో.. ఆడియన్స్ ను అభిమానులను థ్రిల్ చేయాలని ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. జై లవకుశ సినిమా కోసం కొంచం ఒళ్లు చేసాడు. డైట్.. ఎక్సర్ సైజ్ ల విషయంలో ఎన్టీఆర్ చాలా కేర్ తీసుకుంటున్నాడని.. మూవీ స్టార్ట్ అయ్యే సమయానికే మార్పు కచ్చితంగా చూపేతాడని తన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకే.. ఈ సమయంలో ఎక్కడా బైట కనిపించలేదని చెప్పుకుంటున్నారు.