ఎన్టీఆర్ 'జై లవ కుశ' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారిపోతున్నాడని... దానికోసం ప్రత్యేకించి విదేశాలకు వెళ్లి మరి మేకోవర్ అవుతున్నట్లు వార్తలోచ్చాయి. అయితే వాటిని ఎన్టీఆర్ ఖండించేసాడు. అటువంటిదేం లేదు నేను త్రివిక్రమ్ సినిమా కోసం ఎలాంటి మేకోవర్ అవడం లేదని క్లారిటీ ఇచ్చాడు. అయినా ఎన్టీఆర్ లుక్ లో మార్పులుంటాయనే న్యూస్ మాత్రం ఆగడంలేదు. ఎన్టీఆర్ మేకోవర్ కోసం విదేశాలకు వెళుతున్నాడని త్రివిక్రమ్ సినిమాలో కొత్తగా కనబడతాడనే న్యూస్ మాత్రం ఇప్పటికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది.
కానీ త్రివిక్రమ్ సినిమా కోసం ఎటువంటి మేకోవర్ అవడం లేదని ఎన్టీఆర్ ఇంతకుముందు చెప్పిందే నిజమట. న్యూ లుక్ కోసం ఎన్టీఆర్ ఎటువంటి ప్రయత్నాలు చెయ్యడం లేదట. ఎప్పటిలాగే రెగ్యులర్ లుక్ లోనే ఎన్టీఆర్... త్రివిక్రమ్ సినిమాలో కనబడతాడట. కాకపోతే 'జై లవ కుశ' లో కాస్త బొద్దుగా కనబడిన ఎన్టీఆర్ ఈ త్రివిక్రమ్ సినిమాలో మాత్రం కాస్త స్లిమ్ గా కనబడతాడట. ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొంచెం సన్నబడితే బావుంటుందని.. త్రివిక్రమ్ సూచించడంతోనే ఎన్టీఆర్ ఇలా సన్నబడే ప్రయత్నాలు మొదలెట్టాడట.
సినిమా ఆఫీషియల్ గా మొదలైనప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కి చాలా టైం ఉండడంతో ఈ మధ్యలో ఎన్టీఆర్ సన్నబడపోయి సినిమా షూటింగ్ మొదలయ్యే టప్పటికి స్లిమ్ లుక్ లోకి వచ్చేస్తాడట.