త్రివిక్రమ్ కి ప్రాబ్లెమ్ స్టార్ట్ అయ్యిందా?

Update: 2017-09-19 05:49 GMT

పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం కోసం 'అత్తారింటికి దారేది' తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ చాలా రోజులు వెయిట్ చేసాడు. చివరికి ఈ ఏడాది మొదట్లో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలైంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే 25 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం స్టార్ట్ అయినప్పుడే దసరా కి విడుదలవుతుందని ప్రచారం గట్టిగా జరిగింది. కానీ ఈ దసరా నాటికీ పవన్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొత్తం మీద 70 శాతమే పూర్తయినట్లు సమాచారం అందుతుంది. అయితే ఇలా లేట్ అవడానికి కారణం మాత్రం పక్కాగా పవన్ అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ పనులతో, పర్సనల్ పనులతో సినిమాని సీరియస్ గా తీసుకోకపోవడం వలనే ఇంత లెట్ అయ్యిందనేది ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. మరి ఇంతనత్త నడకన సాగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10 న విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి ఇంకా 60 రోజుల పాటు పనిదినాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడే జనసేన పార్టీ రాజకీయాలతో కాస్త బిజీగా హైదరాబాద్, ఏపీలో ఉంటున్నాడు.

మరి పవన్ కళ్యాణ్ ఈ అక్టోబర్ నుండి జనవరి వరకు కేవలం 60 రోజులు కేటాయిస్తే సినిమా జనవరిలో ఎటువంటి ప్రోబ్లేంలేకుండా విడుదల అవుతుంది లేకుంటే కష్టమంటున్నారు. మరి దర్శకుడు త్రివిక్రమ్ పూర్తి స్క్రిప్ట్ ని చేతిలో ఉంచుకుని పవన్ సరిగ్గా డేట్స్ ఇవ్వక నానా కష్టాలు పడుతున్నాడట. అసలు ఈ చిత్రం అక్టోబర్ చివరికల్లా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మిగతా రెండు నెలలు గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం కేటాయిస్తే సరిపోతుందనుకున్న త్రివిక్రమ్ కి ఇప్పుడు పవన్ వల్ల చాలా ప్రాబ్లెమ్ అవుతున్నట్టుగా ప్రచారం మొదలైంది. మరి త్రివిక్రమ్ పవన్ సినిమాని పూర్తి చేసి ఎన్టీఆర్ ని డైరెక్ట్ చెయ్యాల్సిన సినిమా కూడా త్రివిక్రమ్ లిస్ట్ లో వుంది. మరి ఇది పూర్తయితేనే అది పట్టాలెక్కేది. చూద్దాం ఏం జరుగుతుందో.

Similar News