త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమా తర్వాత చేసే ప్రాజెక్ట్ ఏదో తెలుసా?

Update: 2017-12-13 05:25 GMT

ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ చిత్రంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆ చిత్రం తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు. అయితే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా ప్రారంభోత్సవం జరుపుకున్నప్పటికీ... రెగ్యులర్ షూటింగ్ మాత్రం వచ్చే ఫిబ్రవరి నుండి మొదలు కాబోతుంది. అయితే ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా పూర్తి కాగానే దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ బాబు ని డైరెక్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పుడు తాజాగా త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమా పూర్తి కాగానే... త్రివిక్రమ్ చేయబోయే చిత్రం పై క్లారిటీ వచ్చేసింది.

ఎన్టీఆర్ చిత్రం తర్వాత త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా చేయనున్నాడని అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ విషయాన్ని త్రివిక్రమ్ తదుపరి చిత్రాల నిర్మాత ..., హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు డిసెంబర్ 13 సందర్భంగా ఈ వార్తను అభిమానులతో పంచుకున్నారు.

కాకపోతే చిత్రం వచ్చే సంవత్సరం చివర్లో మొదలుకానుంది. వెంకటేష్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రానికి కథ , మాటలు అందించింది త్రివిక్రమ్ కావడం విశేషం..

Similar News