తొలిప్రేమ పోస్టర్ ఇప్పుడు ఎందుకు వదిలినట్టు?

Update: 2018-02-17 08:00 GMT

సినిమాను ప్రమోట్ చేయాలంటే రకరకాలుగా ప్రోమోట్ చేస్తుంటారు. ఆ సినిమాలో కామెడీ సీన్స్ ..పంచ్ డైలాగ్స్ తో పోస్టర్స్ రిలీజ్ చేసి చేస్తుంటారు. ఇప్పుడు మాత్రం అందరు అందులో ఉన్న లిప్ లాకులను హాట్ సీన్లను చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ సృటించింది అర్జున్ రెడ్డి మూవీఏ. ఆ సినిమాలో లిప్ లాక్ పోస్టర్ తో సినిమాను బాగా ప్రోమోట్ చేసారు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ముద్దు పోస్టర్స్ వాడుతున్నారు.

పోయిన వారం రిలీజ్ అయ్యిన వరుణ్ తేజ్ సినిమా తొలి ప్రేమలో ఓ లిప్ లాక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. అనుకున్నట్టుగానే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసులు వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ వెంకీ అట్లూరికి మంచి ప్రశంసలు వస్తున్నాయి. మొత్తానికి సినీమా సక్సెస్ ఫుల్ గా రెండో వారం లోకి అడుగు పెట్టబోతున్న కారణంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్ లో వరుణ్ - రాశి కిస్ చేసుకున్నట్టు దాని కింద మెమోరబుల్ హిట్ తొలి ప్రేమ అంటూ ప్రచురించారు. సినిమా రిలీజ్ అవ్వకముందు చేస్తే ప్రోమోషన్స్ అనుకోవచ్చు. కానీ సినిమా విడుదల అయింది కాలెక్షన్స్ తో రికార్డులు సృష్టిస్తోంది. అయినాసరే ముద్దు స్కీన్లు చూపించి జనాలని ఎందుకు అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నట్టు?

Similar News