తమిళ సినిమా అభిమానులని అమితంగా ఆకర్షించి కథనాయికగా వారి ఆదరాభిమానాలతో పాటు తనకోసం దేవాలయం నిర్మించే స్థాయిలో తనపై అభిమానాన్ని అనతి కాలంలోనే భక్తిగా మలచుకున్న భామ నమిత. తమిళ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తరుణంలోనే అడపాదడపా తెలుగులో వెంకటేష్, బాల కృష్ణ, ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ చిత్రాలలో మెరిసినప్పటికీ అవేవీ నమిత రేంజ్ ని తెలుగు లో పెంచలేకపోయాయి. కాగా ఇటీవల తన వివాహం తో మరొకసారి వార్తల్లోకి వచ్చిన నమిత ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూ లో ఆసక్తికర ఘటనలని వివరించింది.
నమిత తన భర్త తో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో తొమ్మిది సంవత్సరాల క్రితం బాహ్య ప్రపంచానికి తెలియని ఆందోళన కలిగించే ఒక ఆసక్తికరమైన ఘటన ని వివరించింది. "నేను ఒక చిత్ర షూటింగ్ నిమిత్తం కొచ్చి నుంచి చెన్నై వచ్చి ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుండగా ఒక వ్యక్తి వచ్చి నిర్మాత పంపిన డ్రైవర్ తానేనని చెప్పగా కార్ ఎక్కి బయల్దేరాను. కొంత దూరం ప్రయాణం అనంతరం ఆ యువకుడు వెళ్తున్న దారి ఆందోళనకరంగా ఉండటంతో నిర్మాతకి మెసేజ్ పంపగా ఆయన పంపిన డ్రైవర్ ఇంకా ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నారని చెప్పటంతో షాక్ ఐపోయాను. అప్పుడు నా మెసేజెస్ లో నేను ఎక్కడ వున్నది తెలుపుతుండటంతో పోలిసుల సహాయంతో నిర్మాత ఆ గుర్తుతెలియని వ్యక్తి అనుకున్న గమ్యం చేరుకునే లోపే కార్ ని ట్రేస్ చేసి నన్ను రక్షించారు." అంటూ ఉత్కంఠభరితమైన యదార్ధ సంఘటనని వివరించింది నమిత.