యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్ గా చేయనున్న బిగ్ బాస్ షోలో ఆ 12 మంది పార్టిసిపేట్స్ ఎవరో తెలియక అందరూ జుట్టు పీకేసుకుంటున్నారు. ఈ షోలో పాల్గొనబోతున్నారంటూ చాలామంది పేర్లే బయటికి వస్తున్నాయి .ఆ షోకి హోస్ట్ గా చెయ్యబోయే ఎన్టీఆర్ కి కూడా ఈ షోలో ఎవరు పాల్గొంటున్నారో ఇప్పటివరకు తెలియదంట. కానీ రకరకాల పేర్లు మాత్రం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక 70 రోజుల పాటు తల్లితండ్రులను వదిలెయ్యడం, సినిమా పరిశ్రమకు దూరం కావడం, అసలు బయటివారితో ఎవరితో కాంటాక్ట్స్ లేకుండా ఎవరైతే ఉండగలుగుతారో వారే ఈ షోలో పార్టిసిపేట్ చేయగలుగుతారు.
అయితే అలాంటివాళ్లలో మొదటగా బయటికి వచ్చిన పేరు మాత్రం రాంగోపాల్ వర్మ మూవీ ఐస్‌క్రీమ్‌లో తన అందాలతో హీటెక్కించిన తేజస్వి మదివాడ ఈ షోలో కనిపించనుందని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా పూనమ్ కౌర్ కూడా ఈ షో లో పార్టిసిపేట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. కాకపోతే తేజస్వి మాత్రం ఫైనల్ అని చెబుతున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో 70 రోజులపాటు ఉండడానికి ఈ అమ్మడు రెడీ అయ్యిందంటున్నారు. ఇది తనకో ఛాలెంజ్ అంటోందట. ఇక ఈ షో చెయ్యడానికి అమ్మడుకి భారీ పారితోషకం అందినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.
ఇకపోతే ఈ షో లో మరికొందరి పేర్లు కూడా వినబడుతున్నాయి. మంచు లక్ష్మి, నవదీప్, స్నేహ, రంభ, కె ఏ పాల్, పొలిటీషియన్ జలీల్ ఖాన్ వంటి పేర్లు మాత్రం గట్టిగా వినబడుతున్నాయి. మరి ఈ షో 16 న స్టార్-మా లో ప్రసారం అయ్యేవరకు వారి పేర్లు బయటపెట్టకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తారో లేకపోతె ఈ గ్యాప్ లో ఏమన్నా బయటపెడతారో అనేది మాత్రం ప్రస్తుతానికి తెలియాల్సి వుంది.