తెలుగులో టెంపర్ అయితే.. హిందీలో?

Update: 2017-12-07 14:00 GMT

గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రం అతడి కెరీర్ లో మరిచిపోలేని విజయాన్ని అందించడమే కాదు... కెరీన్ ని మలుపుతిప్పింది కూడా. వరుస పరాజయాలతో సతమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు ఈ చిత్రం విజయాల బాట పట్టించిందనే చెప్పాలి. వక్కంతం వంశీ కథతో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం వసూళ్లు కురిపించింది. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి హిందీలో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో 'టెంపర్' పేరుతొ వచ్చిన ఈ సినిమాని బాలీవుడ్ లో ‘సింబా’ పేరుతొ రీమేక్ చేస్తున్నారు .

టెంపర్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ , రోహిత్ శెట్టి పిక్చర్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగులో దయా పాత్రలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ పాత్రను బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ ‘సంగ్రామ్ భాలేరావ్’గా చేయనున్నాడు. ఈ చిత్రం టైటిల్ , ఫస్ట్ లుక్ ను ఈరోజు గురువారం ఉదయం ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు రణ్వీర్ సింగ్. ఈ చిత్రం వచ్చే సంవత్సరం డిసెంబర్ 28న విడుదల కానుంది. తెలుగులో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం హిందీలో ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 28 , 2018వరకు ఆగాల్సిందే..

Similar News