జూనియర్ ఎన్టీఆర్ - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న జై లవ కుశ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్దిరోజుల ముందే విడుదలై అందరి మన్ననలు పొందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తుండడంతో అందరిలో అమితాసక్తి నెలకొంది. జై లవ కుశ లోని జై టీజర్ లో ఎన్టీఆర్ నటన అమోఘం అంటున్నారు. జై పాత్రలో ఎన్టీఆర్ తన విలనిజాన్ని చూపించి ఎన్టీఆర్ లో మహా నటుడు దాగున్నాడని నిరూపించాడు. అయితే ఈ టీజర్ యూట్యూబ్ లో విడుదలై సంచలనాలు నమోదు చేస్తుంది.
ఒక్క టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేసిన జై లవ కుశ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో అఫీషియల్ గా 10 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని అదరహో అనిపించింది. ఇప్పటి వరకు జై టీజర్ కి 10, 114, 198 హిట్లతో పాటు 2,35,000 లైక్స్ వచ్చాయి. అయితే అతి తక్కువ సమయంలో జై లవ కుశ టీజర్ ఇంతలా ఆదరణ పొందడం అనేది రేర్ అని చెప్పొచ్చు. ఇక జై లవ కుశ కి మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం అంటున్నారు. ఇక జై లవ కుశ లో ఎన్టీఆర్ సరసన మొదటిసారి రాశి ఖన్నా, నివేత థామస్, నందితాలు నటిస్తున్నారు.