ఇప్పుడు తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించేసుకున్నాడు. మిగతా రోజుల్లో ఎలా వున్నా శని ఆదివారాల్లో మాత్రం ఎన్టీఆర్ బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాక కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తే పరిస్థితి వచ్చేసింది. కేవలం ఎన్టీఆర్ వలెనే బిగ్ బాస్ షోకి అంత క్రేజ్ వచ్చిందనేది మాత్రం వాస్తవం. ప్రతి కుటుంబంలోకి నేరుగా వెళ్లకపోయినా అందరి మనసులను దోచేసిన ఎన్టీఆర్ బిగ్ బాస్ సీజన్ వన్ చివరి దశకు వచ్చేసింది. ఈ ఆదివారమే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే. ఈ బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ వన్ ముగియగానే మళ్ళీ బిగ్ బాస్ యాజమాన్యం ఎక్కువ సీజన్స్ నే రన్ చేసే యోచనలో ఉంది గనక ఇప్పుడు బిగ్ బాస్ రెండో సీజన్ కోసం అంతా సిద్ధం చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేస్తున్నారనే టాక్ కూడా వినబడుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ టు కి ఎన్టీఆర్ హోస్ట్ చేస్తారంటున్నారు. మరో పక్క ఎన్టీఆర్ మళ్ళీ హోస్ట్ చెయ్యడానికి ఆసక్తి చూపకపోతే అయన ప్లేస్ లోకి మరో హీరో ని సెట్ చేసే పనిలో పడ్డారట బిగ్ బాస్ యాజమాన్యం.
తారక్ గనక ఒప్పుకోకపోతే తారక్ ప్లేస్ లోకి మరో ఇద్దరు హీరోలు బిగ్ బాస్ షోకి హోస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్ వినబడుతుంది. సీజన్ టు లో ఈసారి ఫామ్ లో ఉన్న సెలెబ్రిటీస్ పార్టిసిపేట్ చేస్తారని కూడా వార్తలొస్తున్నాయి. మరి బాలీవుడ్, కోలీవుడ్ మాదిరిగా తెలుగు బిగ్ బాస్ లో ఎటువంటి కాంట్రవర్సీ క్రియేట్ కాకపోవడంతోనే కొంతమంది సెలబ్రిటీస్ ఈ షో మీద ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే తారక్ గనక ఒప్పుకోకపోతే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి హీరో నానిని గాని, లేకుంటే అక్కినేని అఖిల్ ని గాని తారక్ ప్లేస్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ ఇద్దరూ ఒప్పుకుంటే ఒక్కో సీజన్ కి ఒక్కరిని హోస్ట్ చేయిస్తే బావుంటుందని ఆలోచన కూడా బిగ్ బాస్ యాజమాన్యం చేస్తుందట.చూద్దాం సీజన్ టు లో హోస్ట్ ఎన్టీఆరా లేక నానినా లేక అఖిలా అనేది.