టాలీవుడ్ లో బిగ్ బాస్ మొదలవుతుంది దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రాబోతున్నాడు అనగానే ఆ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. వెండితెర మీద ఎనర్జిటిక్ డాన్సులతో... అదిరిపోయే పెరఫార్మన్స్ చేసే ఎన్టీఆర్ బుల్లితెర మీద కూడా ఇరగదీస్తాడని ఎన్టీఆర్ ఫాన్స్ ఎప్పటినుండో ఇదైపోతున్నారు. ఇక సాధారణంగా బుల్లితెర మీద వచ్చే టివి సీరియల్స్ కి మహిళా ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. మరి బుల్లితెర మీద ఎన్టీఆర్ పెరఫార్మెన్సు ఎలా ఉండబోతుందో అంటూ సాధారణ ప్రేక్షకుడు కూడా బాగా వెయిట్ చేసాడు.
వాళ్ళు వెయిట్ చేసినట్టే ఎన్టీఆర్ బుల్లితెరమీద అదరగొట్టే పెరఫార్మెన్సు తో.... సూపర్ డాన్స్ లతో... ఇరగ్గొట్టేసాడు. ఇక ఎన్టీఆర్ ఈ షో చేసినప్పటి నుండి స్టార్ మా కి ఛానల్ కి ఫుల్ పబ్లిసిటీ వచ్చేయ్యడమే కాదు.... ఇప్పుడు రికార్డ్ స్థాయి టీఆర్పీలు వచ్చేసాయి. ఇంకేముంది ఎన్టీఆర్ బుల్లితెర మీద రారాజుగా అవతరించాడు. ఇక దెబ్బకి నాలుగో స్థానంలో ఉన్న స్టార్ మా నెంబర్ వన్ స్థానానికి ఎగబాగేసింది.
ఈ దెబ్బకి ఎన్టీఆర్ ని పలువురు ప్రముఖులు ప్రశంసలతో ముంతెచ్చుతున్నారు. ఈ ప్రముఖుల్లో కింగ్ నాగార్జున కూడా ఉన్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మొదటి రెండు సీజన్స్ లో అసరగోట్టిన నాగార్జున ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ లో చేస్తున్న పెరఫార్మెన్సు కి పడిపోయాడు. నాగార్జున, ఎన్టీఆర్ ఎనేర్జికి ఫిదా అయిపోయి... బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ ఎనర్జీ సూపర్బ్ అంటూ పొగిడేసాడు. ఇక నాగార్జున అలా ఎన్టీఆర్ ను పొగుడుతూ ట్వీటేసాడో లేదో.... ఎన్టీఆర్ థ్యాంక్స్ బాబాయ్ అంటూ రిప్లై కూడా ఇచ్చేసాడు. అంతేకాకుండా మీరు చూపించిన మార్గంలోనే నేను నడుస్తున్నా అంటూ హ్యాపీ ట్వీట్ చేసాడు.