తారక్ చిత్రంలో శ్రీదేవి కూతురు హీరోయిన్..!

Update: 2018-01-27 10:00 GMT

ఉత్తరాది ప్రేక్షకులు, దక్షిణాది ప్రేక్షకులు అనే భేదం లేకుండా యావత్ భారత దేశంలో అభిమానులని కలిగి వున్న నిన్నటి తరం అందాల తార శ్రీదేవి గత కొంత కాలంగా తన తనయురాలు జాన్వీ కపూర్ పరిచయ చిత్రంపై తెగ తర్జన భర్జనలు పది ఎట్టకేలకు మరాఠి లో బ్లాక్ బస్టర్ సాధించిన సైరాట్ చిత్ర హిందీ రీమేక్ లో కథానాయికగా జాన్వీ కపూర్ ని బాలీవుడ్ కి పరిచయం చేస్తుంది శ్రీదేవి.

రెండో చిత్రం.....

ప్రస్తుతం సెట్స్ పై వున్న జాన్వీ తొలి చిత్రం ఇంకా షూటింగ్ తుది దశకి కూడా చేరుకోక ముందే అమ్మడికి రెండవ చిత్రాన్ని కూడా సెట్ చేసేసింది శ్రీదేవి. తొలి చిత్రంలో నటనకి స్కోప్ వున్న రోల్ కావటంతో రెండవ చిత్రాన్ని కమర్షియల్ చిత్రం సెలెక్ట్ చేసింది. అయితే ఈ చిత్రం కూడా రీమేక్ కావటం గమనార్హం. యంగ్ టైగర్ ఎం.టి.ఆర్ నటించిన టెంపర్ చిత్రాన్ని బాలీవుడ్ లో రోహిత్ శెట్టి రీమేక్ చేయనున్నారు. కాగా తెలుగు లో కాజల్ అగర్వాల్ పోషించిన పాత్రకి కొన్ని మార్పులు చేర్పులు చేసి మరిన్ని కమర్షియల్ మెరుగులు దిద్ది ఆ పాత్రని జాన్వీ కపూర్ తో చూపించటానికి డిసైడ్ అయిపోయారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

Similar News