జై లవ కుశ లోని జై టీజర్ ఎన్టీఆర్ టాలీవడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. గురువారం సాయంత్రం విడుదలైన జై టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసి పారేస్తోంది. ఇందులోని ఎన్టీఆర్ నటనకు టాలీవుడ్ ప్రముఖులు పొగడ్తల వర్షం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ తో అదరగొడుతూ రావణాసురుడులా వెలిగిపోతూ వికటాట్టహాసంతో నవ్వుతూ అదిరిపోయే నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక దీనికి తోడు జై లవ కుశ బ్యగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయిందని అంటున్నారు.
ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసాడు డైరెక్టర్ బాబీ. ఇక భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవ కుశ టీజర్ చూసిన టాలీవుడ్ లోని ప్రముఖులు తమ స్పందనని ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. ఒక్క టాలీవడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్ డైరెక్టర్ అయిన రజనీకాంత్ డాటర్ సౌందర్య కూడా జై టీజర్ లో ఎన్టీఆర్ నటనకు పొగడకుండా ఉండలేకపోయింది. మరి ఇంతమంది ఎన్టీఆర్ ని పొగిడేస్తుంటే ఎన్టీఆర్ కూడా వాళ్ళకి స్వీట్ గా థాంక్స్ కూడా చెప్పేసాడు.
తన ట్విట్టర్ వేదికగా తనని పొగిడిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. 'అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు, మీడియా నుంచి వెల్లువెత్తుతున్న ప్రేమ, వారి అభినందనలు, ఫీడ్‌బ్యాక్‌తో చాలా ఆనందమేస్తోంది. ఇంకా..ఇంకా మెరుగయ్యేందుకు కృషి చేస్తాను. లవ్ యూ ఆల్’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా థాంక్స్ చెప్పేసాడు.