బాబీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రం టీజర్ నిన్న గురువారం సాయంత్రం విడుదలై యూట్యూబ్ లో సంచలనాలు నమోదు చేస్తుంది. 'జై లవ కుశ' లో జై టీజర్ ని కొత్తగా విడుదల చేసిన చిత్ర యూనిట్ మరో రెండు టీజర్స్ ని అతిత్వరలోనే విడుదల చేస్తామని చెబుతుంది. ఇక విడుదలైన జై టీజర్ లో ఎన్టీఆర్ విలన్ గా అదిరిపోయాడంటూ టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జై టీజర్ లో ఎన్టీఆర్ విలన్ గా సూపర్బ్ గా ఆకట్టుకుంటున్నాడని... ఆ హావభావాలు ఎన్టీఆర్ లోని మరో వ్యక్తి బయటికి వచ్చాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు వారు.
జై టీజర్ పై వారు ట్విట్టర్ లో ఏమ్మన్నారో మీరే చూడండి.
అందరికన్నా ముందుగా ఎన్టీఆర్ కి ఇండస్టర్లో సన్నిహితుడుగా పేరున్న దర్శకధీరుడు రాజమౌళి 'తారక్ టీజర్ చాలా బాగుంది. సూపర్... ఓ రకంగా సినిమాకు ఇలా ప్రచారం ప్రారంభించేశావ్.. సూపర్' అంటూ స్పందించాడు.
కే రాఘవేంద్ర రావు: ఎన్టీఆర్ జై టీజర్ కి ఫిదా అయ్యానంటూ ‘ఇలాంటి పాత్రలు చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలని, ఆ ధైర్యం మా తారక్‌కు ఉంది.. తారక్ ధైర్యాన్ని తెర మీద చూసేందుకు తాను ఎదురు చూస్తున్నానని' ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ: ‘జవాన్‌లోని జై.. జైలవకుశలోని జైకి స్వాగతం పలుకుతున్నాడు. వెల్‌కమ్ తారక్' అంటూ ఫ్రెండ్లిగా ట్వీట్ చేసాడు.
ఇక టాలీవుడ్ మరో యంగ్ హీరో నితిన్: 'వావ్.. కిక్‌యాస్ టీజర్. తారక్ నువ్వు సంపేశావ్ పో.. దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ రాకింగ్. బాబి కంగ్రాట్స్’ అంటూ ట్వీట్ చేశారు.
రజనీకాంత్ డాటర్ సౌందర్య: ‘గో ఫర్ ఇట్ తారక్. సూపర్‌గా ఉంది’ అంటూ ట్వీట్ చేసింది.