బాహుబలి తర్వాత అమెరికా వెళ్లి మరీ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ మధ్యలో సాహో చిత్రం కోసం మేకోవర్ కూడా అవుతున్నాడు. బాహుబలి భారీ బడ్జెట్ సినిమా తర్వాత మళ్ళీ మరో భారీ బడ్జెట్ సాహో లో నటిస్తున్న ప్రభాస్ ఆ చిత్రంకోసం బాగానే కష్టపడుతున్నాడు. బాహుబలికోసం పెంచిన కండలు కరిగించి ఇప్పుడు సన్నగా అందంగా కనబడుతున్నాడు. అప్పుడప్పుడు లీకవుతున్న పిక్స్ లో ప్రభాస్ లుక్ చూస్తుంటే సాహో కోసం కొత్తదనం ట్రై చేస్తున్నాడనిపిస్తుంది. అయితే పెద్దగా బయటికి రాకుండా ప్రస్తుతానికి కుటుంబంతో గడుపుతూ లో ప్రొఫైల్ మైంటైన్ చేసున్నాడు ప్రభాస్.
కాకపోతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూతురు పెళ్ళిలో సందడి చేసిన ప్రభాస్, మళ్ళీ ఇప్పటివరకు ఎటువంటి పబ్లిక్ ఫంక్షన్ లో కనబడలేదుగాని ఇప్పుడోక పబ్లిక్ ఈవెంట్ కి హాజరవుతాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాప్సి నటించిన ఆనందో బ్రహ్మా కోసం ప్రభాస్ బయటికి రాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. తాప్సి లీడ్ రోల్ లో కనిపిస్తున్న ఆనందో బ్రహ్మా చిత్రం విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యడానికి నిర్మాతలు ,హీరోయిన్ తాప్సి కూడా ప్రభాస్ గెస్ట్ గా ఆనందో బ్రహ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.
మరి ప్రభాస్ గెస్ట్ అంటే ఆ ఈవెంట్ ఏ రేంజ్ లో జరగాలి?. అందుకే ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతుండటంతో ఆనందో బ్రహ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఆగస్ట్ 14న పార్క్ హాయత్ లో ఈ సినిమా ఫంక్షన్ జరగుతుందని సమాచారం. అయితే ఈ ఈవెంట్ కి రావడానికి ప్రభాస్ వప్పుకున్నది మాత్రం తన ఫ్రెండ్ తాప్సి కోసమే అని చెబుతున్నారు.