తమ్ము ప్లస్సా.. మైనస్సా..

Update: 2017-09-15 13:44 GMT

ఎన్టీఆర్ జై లవ కుశ లో తమన్నా ఐటెం సాంగ్ అని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నా... చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకుండా తమన్నా ఐటెం సాంగ్ విషయాన్నీ దాచి పెడుతూ వచ్చింది. అయితే జై లవ కుశ ఆడియో పాటలన్ని ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి రావడం... జై లవ కుశ పాటల ప్రెస్ మీట్ కూడా జరగడం జరిగినా.... తమన్నా సాంగ్ మాత్రం బయటికి రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా తమన్నా ఐటెం సాంగ్ కి సంబందించిన డీటెయిల్స్ ని చిత్ర బృందం తమన్నా పోస్టర్ తో పాటే రివీల్ చేసింది. మరి తమన్నా ఆ ఐటెం లో ఎలా రెచ్చిపోయిందో ఆ పోస్టర్ లో హింట్ ఇచ్చేసింది జై లవ కుశ యూనిట్.

తమన్నాకి ఐటెం సాంగ్స్ లో నటించిన అనుభవం చాలానే ఉంది. ఇప్పటికే అల్లుడు శీను, స్పీడున్నోడులో ఐటమ్స్ లో చిందులు తొక్కినా తమన్నా ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఐటెం చిందులుకు రెడీ అయ్యింది. ఇక తమన్నా జై లవ కుశలోని 'స్వింగ్ జరా' అనే పాట ఈ రోజు సాయంత్రమే విడుదల చేస్తుంది చిత్ర యూనిట్. మరి ఆ సాంగ్ కి దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ అదుర్స్ అంటున్నారు. ఇక దేవిశ్రీ కూడా 'యు రాక్‌డ్ ద సాంగ్ తమన్నా.. ప్రేక్షకులు ఎన్టీఆర్, నీ డ్యాన్స్‌ని చాలా ఇష్టపడతారు.'అని ట్వీట్ చేశారు. అలాగే జై లవ కుశ దర్శకుడు బాబీ కూడా ఈ తమన్నా ఐటెం పై ట్విట్టర్ వేదికగా' ఈ స్పెషల్ సాంగ్‌ని మరింత స్పెషల్ చేసినందుకు థాంక్యూ తమన్నా' అంటూ ట్వీట్ చేసాడు.

మరి ఎన్టీఆర్ కూడా ఇంతకుముందు టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో జనతా గ్యారేజ్ లో ఐటెం లో అదరగొట్టాడు. మరి ఇప్పుడు తమన్నాతో కూడా మరోమారు ఐటెం ని అదరగొట్టడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు తమ్ము ఐటమ్స్ చేసిన సినిమాల్లో తమన్నా ఐటెం సాంగ్ కి పేరొచ్చిందికాని.... ఆమె ఐటమ్స్ చేసిన సినిమాలేవీ పెద్దగా విజయం సాధించలేదు. మరి ఇప్పుడు తమ్ము, ఎన్టీఆర్ కి అయినా విజయాన్ని అందిస్తుందో లేదో మరో ఆరు రోజుల్లో తెలిసిపోనుంది.

Similar News