తమిళ బిగ్ బాస్ విన్నరెవరో తెలుసా?

Update: 2017-10-01 17:18 GMT

తెలుగు బిగ్ బాస్ ఫినిష్ అయ్యి వారం కావొస్తోంది... ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ హీరో ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ విజేత శివబాలాజీ... అయితే తమిళ బిగ్ బాస్ సీజన్ విన్నర్ కూడా తెలిసిపోయింది. కమల్ హాసన్ వ్యాఖ్యాతగా తెరకెక్కిన తమిళ బిగ్ బాస్ విజయదశమి రోజున గత అర్ధరాత్రి ఫైనల్ విన్నర్ ని ప్రకటించడంతో ముగిసింది. తెలుగు బిగ్ బాస్ కన్నా ముందే మొదలైన ఈ తమిళ బిగ్ బాస్ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు అవడమే కాదు బిగ్ బాస్ నిర్వాహకులతో పాటు షోని నడిపించిన కమల్ మీద కోర్టు కేసులు కూడా నమోదు అయ్యాయి.

అయినా కూడా కమల్ వ్యాఖ్యాతగా ఈ షోని రక్తి కట్టించారు తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇకపోతే తమిళ బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఫైనల్ గా ఎవరు అంటే ఆరవ్ అనే మాములు మోడల్...... తమిళ బిగ్ బాస్ సీజన్ 1 కిరీటాన్ని ఎగరేసుకుపోయాడు. ఆరవ్ అంటే తమిళంలోనూ పెద్దగా పరిచయం లేని పేరే. చెన్నైకి చెందిన ఒక మోడల్ ఈ ఆరవ్. అయితే బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు ఆరవ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఈ షోలో హీరోయిన్ ఒవియా వలన ఆరవ్ ఒక్కసారిగా హైలెట్ అయ్యాడు. ఒవియా ఈ బిగ్ బాస్ హౌస్ లో ఆరవ్ ని ప్రేమించడం.. అలాగే అనుకోకుండా ఒవియా ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చెయ్యడం వంటి విషయాలతో తమిళ బిగ్ కి పిచ్చ క్రేజ్ వచ్చేసింది.

అయితే ఒవియా అనుకోని కారణాలతో బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావడమే తరువాయి ఆమె ఒక్కసారికి టాప్ సెలబ్రిటీ అవతారం ఎత్తడం.. కొన్ని ఇంటర్వూస్ లో ఆరవ్ గురించి పాజిటివ్ గా మాట్లాడం మాత్రమే కాదు ఇంకా తాను ఆరవ్ ని ప్రేమిస్తున్నట్టు కూడా చెప్పడం వంటి విషయాలతో అతని మంచి గుర్తింపు వచ్చేసింది. ఇకపోతే తమిళ బిగ్ బాస్ ఫైనల్ కి వెళ్లిన నలుగురు అబ్బాయిలే. అమ్మాయిలంతా ముందే హౌస్ నుండి ఎలిమినేటి అవడం.. ఇక ఫైనల్స్ లో కూడా గణేష్, హరీష్ ముందుగా ఎలిమినేట్ అవడం తర్వాత మిగిలిన ఇద్దర్లోంచి ఆరవ్‌ను విజేతగా ప్రకటించారు కమల్.

ఇక తమిళనాట కూడా తెలుగులో వలే స్నేహన్‌నే ఫేవరెట్‌గా కంటెస్టెంట్ గా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరిగినా... చివరికి ఆరవే టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇక తెలుగులో కూడా హరితేజనే బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ అవుతుంది అనుకుంటే.. అనూహ్యంగా శివ బాలాజీ బిగ్ బాస్ సీజన్ విన్నర్ అయ్యాడు.

Similar News