మహేష్ బాబు తన పనిలో ఎంత కమిట్మెంట్ చూపిస్తాడో... ఫ్యామిలీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. షూటింగ్స్ తో ఎంత బిజీగా వున్నా కూడా దొరికిన కాస్త సమయమైనా ఫ్యామిలీతో గడిపేస్తాడు. షూటింగ్స్ కి బ్రేక్ వచ్చినప్పుడు తన భార్య పిల్లల్తో కలిసి వెకేషన్స్ కి విదేశాలకు చెక్కేస్తూ అక్కడ పిల్లలతో బాగా ఎంజాయ్ చేసే మహేష్ కి తన కూతురు సితార అంటేప్రత్యేకమైన ప్రేమ. తనకి కూతురు పుట్టినప్పుడు తన ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందంటూ ఆనందపడ్డ మహేష్ సితార ఏ పని చేసినా చాలా ముద్దుగా చేస్తుందని... సితార అల్లరి చూస్తుంటే డే ఎలా గడిచిపోయిందో కూడా తెలియదని చెప్పే మహేష్ ఇప్పుడు తన కూతురు పుట్టినరోజు రోజున ఒక స్పెషల్ ట్వీట్ చేసాడు.
తన కూతురు సితార బర్త్ డే స్పెషల్ గా సోషల్ మీడియాలో గ్రీటింగ్స్ తెలియజేశాడు. ఆ ట్వీట్ ఏమిటో మీరే చూడండి. సితార నా ప్రతి రోజును స్పెషల్ గా మారుస్తుంది. తనకు ప్రత్యేకమైన ఈ రోజున మరింత ప్రేమ, అంతులేని ఆనందం దక్కాలి. నా కూతురు ఐదో వసంతంలో అడుగుపెట్టింది. తానూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ పోస్ట్ చేసాడు. కేవలం కూతురు మీద ప్రేమను అక్షరాలా రూపంలో మాత్రమే చెప్పకుండా కూతురుతో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసాడు.
ఇక మహేష్ నటిస్తున్న 'స్పైడర్' చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం దసరా కానుకగా విడుదలవుతుండగా... ఇప్పుడు తాజాగా మహేష్ కొరటాల డైరెక్షన్ లో 'భరత్ అను నేను' చిత్రంలో నటిస్తున్నాడు.