సినిమా ఇండస్ట్రీలోకి అడుపెట్టిన హీరోయిన్స్ దగ్గరనుండి ఆ గ్లామర్ ఫీల్డ్ లో ఉండే మోడల్ వరకు ఎప్పుడూ కొత్త ఫ్యాషన్ ని ఇష్టపడాల్సిందే. హీరోయిన్స్ వేసే డ్రెస్ దగ్గరనుండి వారు ఎలాంటి జ్యువెలరీ పెట్టుకున్నారు, అలాగే ఎలాంటి మ్యాచింగ్స్ వేసుకున్నారు. అంతేకాకుండా ఏవరు ఎలాంటి చెప్పులు, షూస్ వేసుకున్నారు అనే దాన్ని అందరూ బూతద్దంలో పెట్టి చూస్తారు. అందుకే హీరోయిన్స్ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు.. కాదు కోరుకోవాలి. అందుకే వారి దగ్గర అనేక రకాల డ్రెస్సులు, చెప్పులు, జ్యువలరీ లు కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయి.
హీరోయిన్స్ ఎక్కడ షాపింగ్ చేసిన హెయిర్ బ్యాండ్స్ దగ్గరనుండి చెప్పుల వరకు షాపింగ్ చేస్తూ గడిపేస్తారు. విదేశాల్లో షాపింగ్ అయినా.. స్వదేశంలో షాపింగ్ అయినా సరే సెలబ్రిటీస్ మాత్రం ఇలాంటి షాపింగ్ మాత్రమే చేస్తారు. అయితే ఇప్పుడు ఒక హీరోయిన్ కి చెప్పులంటే చాలా ఇష్టమట. ఆమె ఎంత షాపింగ్ చేసిన ఎక్కువగా చెప్పుల షాపింగ్ నే ఇష్టపడుతుందట. ఆమె ఎవరో కాదు... ఈ మధ్య సినిమాల్లేక ఖాళీ అయ్యి బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న శృతి హాసన్. శృతి హాసన్ తాను చేసే షాపింగ్ గురించి మట్లాడుతూ నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరూ ఒక్కో రకమైన వస్తువులను ఇష్టపడుతుంటారు.
కానీ నాకు మాత్రం చెప్పులంటే ప్రాణం. అందుకే హీల్స్ ఉన్న శాండిల్స్, ఫ్లాట్ చెప్పులు, షూస్.. ఇలా ఒకటేంటి రకరకాల చెప్పులను సేకరించాను. అసలు ఒకసారి అయితే నేను షాపింగ్ చేసిన చెప్పులు దాదాపుగా 100 జతలయ్యేసరికి ఇక చాలు... ఇంకెప్పుడు చెప్పుల షాపింగ్ చెయ్యకూడదు అని అనుకున్నా. కానీ ఆ తర్వాత మరలా ఎక్కడికో షాపింగ్ వెళ్లినప్పుడు టెంప్టింగా కొన్ని చెప్పుల జతలు కనిపించాయి. అలా మళ్లీ చెప్పులు కొండడం మొదలెట్టేసాను అంటూ ప్రతి డ్రస్‌కీ మ్యాచ్ అయ్యేలా కనీసం నాలుగైదు పెయిర్స్ కొనేస్తున్నాను ఇప్పుడు అంటూ తన చెప్పుల షాపింగ్ గురించి గుక్కతిప్పుకోకుండా చెబుతుంది ఈ సుందరి.