బాహుబలితో జాతీయ స్థాయిలో టాప్ డైరెక్టర్ గా పేరు కొట్టేసిన రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎటువంటి క్లారిటీ లేదు. కాకపోతే తన తండ్రి రాస్తున్న కథ ఏ హీరో సెట్ అవుతాడో చెప్పలేనంటున్నాడు. అలాగే ,మహేష్ తో పవన్ తో సినిమా చేయాలంటున్నారు. మహేష్ తో సినిమా తీసే ఛాన్స్ ఉన్నప్పటికీ పవన్ తో సినిమా చెయ్యడానికి ఛాన్స్ దొరక్కపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే పవన్ ఒక పక్క చాలా సినిమాల కమిట్మెంట్స్ తో మరోపక్క 2019 ఎన్నికలకు సమాయత్తమవడానికి బిజీగా ఉన్నాడు కాబట్టి. ఇక మహేష్ అంటారా ఇప్పుడు 'స్పైడర్' చిత్రం ముగింపు దశలో ఉంది. ఆల్రెడీ కొరటాలతో 'భరత్ అను నేను' షూటింగ్ తో సెట్స్ మీదున్నాడు. ఇకపోతే వంశి పైడిపల్లితో కూడా ఒక చిత్రం కమిట్ అయ్యాడు. వీటి తర్వాత రాజమౌళి సినిమాయే చేసేలా కనిపిస్తున్నాడు.
నిర్మాత ఆదినారాయణకు ఇచ్చిన కమిట్మెంట్స్ తో రాజమౌళి ఖచ్చితంగా మహేష్ తోనే సినిమా చెయ్యాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఏ హీరోతో సినిమా చేసినా రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మాత్రం మహేష్ తోనే చేసేలా కనబడుతుంది వాతావరణం. అలాగే వీరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా మాత్రం రికార్డులకు నెలవుకానుందనిప్రచారం మాత్రం జోరుగా జరుగుతుంది. బాహుబలితో పలు రికార్డులను నెలకొల్పిన రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ అందగాడు, మంచి క్రేజ్ ఉన్న మహేష్ హీరోగా నటిస్తే రికార్డులు బద్దలు కాక ఏమవుతాయని అంటున్నారు సినీప్రియులు.
బాహుబలి పార్ట్ 1 తోనే మొదటిరోజు 22 కోట్ల షేర్ సాధించిన రాజమౌళి బాహుబలి 2 కి ఆ షేర్ 42 కోట్లు దాటింది. మరి పార్ట్ 1 కి పార్ట్ 2 కే షేర్ ఎంతలా పెరిగిందో చూసారు కదా. ఇక మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో మూవీ మాత్రం మొదటిరోజే 42 కోట్ల షేర్ ని సునాయాసంగా దాటేసి రికార్డు సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. మరి అలా చేస్తే రాజమౌళి తన రికార్డుని తానే బద్దలు కొట్టేస్తాడు కదా అంటున్నారు. ఇప్పటికే తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ టాక్ అఫ్ ద ఇండస్ట్రీ అయిన రాజమౌళి మహేష్ తో సినిమా మాత్రం పక్కాగానే ఉంటుందని సెలవిస్తున్నారు. మరి వీరి కాంబినేషన్ లో మూవీ త్వరలోనే పట్టాలెక్కలని ఆశిద్దాం.