తండ్రినే తలదన్నే రీతిలో!!

Update: 2017-07-26 03:06 GMT

ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవరికి లేదు. పవన్ సినిమాలు హిట్ అయినా ఫట్ అయినా కూడా అతని సినిమాలనంటే అభిమానులకి పిచ్చ క్రేజ్. కేవలం ఒక హీరోగానే కాకుండా పవన్ అంటే ఒక వ్యక్తిగా కూడా పూజించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క సినిమాల్లోనేకాక పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ యాక్టీవ్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక వ్యకిగతంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యకి పిల్లలు లేరు. కానీ రెండో భార్య రేణుకి మాత్రం ఇద్దరు పిల్లలున్నారు. రేణు దేశాయ్ తో విడాకులు తీకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ తమ ఇద్దరి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూనే ఉన్నాడు. ఆద్య, అకీరాతో కాస్త టైం స్పెండ్ చేస్తూనే తండ్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇక మూడో భార్య కి కూడా ఒక అమ్మాయి ఉంది.

అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల మీద దృష్టి పెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ఎప్పటినుండో ప్రచారం జరుగుతుండగా.... పవన్ ప్లేస్ లోకి ఆయన కొడుకు అకీరా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడని పవన్ అభిమానులు ఆశపడుతున్నారు. మరి అఖీరా నందన్ త్వరలోనే సినీరంగ ప్రవేశం ఉండబోతుందంటూ సోషల్ మీడియాలో ఆమద్యన చాలానే వార్తలొచ్చాయి. కానీ రేణు గాని, పవన్ గాని ఆ వార్తలను ఖండించడం గాని, లేకుంటే సమర్ధించడంగాని చెయ్యలేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పిల్లతో కలిసి ఎక్కడికో వెళుతుండగా ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్, అఖీరా, ఆద్య ల ఫొటోస్ తీసి పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఆ ఫొటోస్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో నడిచి వస్తున్నాడు. కూతురు ఆద్య కూడా పవన్ పక్కనే నడుస్తుండగా... పవన్ కొడుకు మాత్రం పవన్ వెనుకగా నడుస్తున్నాడు. ఇక ఈ పిక్ లో 13 ఏళ్ళ అఖీరా, పవన్ కళ్యాణ్ ని హైట్ పరంగా మించిపోయి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ కొడుకుతో దిగిన ఫొటోస్ ఎక్కడా కనబడలేదు. ఇప్పుడు ఇలా తండ్రి కన్నా ఎత్తుగా అఖీరా కనిపిస్తుంటే మాత్రం అఖీరా ఎంత ఎదిగిపోయాడు అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు పవన్ ఫాన్స్. ఇక ఈ పిక్ లో అఖీరా మాత్రం తండ్రి పవన్ ఎత్తుకు మించిపోయి కనబడుతున్నాడనేది మాత్రం వాస్తవం.

Similar News