మహానటి సావిత్రి బయోపిక్‌ని 'మహానటి' పేరుతో అశ్వనీదత్‌కుమార్తెలు, ఆ ఇంటి అల్లుడైన 'ఎవడే సుబ్రహ్మణ్యం' ఫేమ్ నాగ్ అశ్విన్‌తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సావిత్రి అంటే ఆమె నటన, సినీ రంగంలో ఓ వెలుగు వెలిగిన నటిగానే గాక నాడు తమిళంలో కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పేరొందిన జెమినీ గణేషన్‌తో రహస్య ఎఫైర్, సీక్రెట్ మ్యారేజ్, ఆ తర్వాత ఆమెను అతను వాడుకున్న తీరు, మోసం చేసినవిధానం ఇలా ఎన్నో కోణాలున్నాయి. ఇక ఈ చిత్రంలో 'మహానటి' సావిత్రిగా నటిస్తున్న కీర్తిసురేష్‌కూడా నాడున్న సావిత్రిలాగానే బొద్దుగా అచ్చు అలానే కనిపిస్తూ ఉండే లుక్ విడుదలైంది.
ఇక ఈచిత్రంలో ఆమె తర్వాత ప్రధానపాత్ర జెమినీ గణేషన్‌దే. మన తెలుగువారు ఆయన్ను విలన్‌గా చూసినా కూడా ఆయనకంటూ ఇప్పటికీ తమిళంలో మంచి పాపులారిటీనే ఉంది. దాంతో నెగటివ్ కోణంలో నటించడానికి సూర్య వంటి హీరోలు కూడా భయపడ్డారు. ఎట్టకేలకు 'ఒకే బంగారం'తో తెలుగుప్రేక్షకులకు పరిచయం ఉన్న దిగ్రేట్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్‌ని ఆ పాత్రకు ఎంపిక చేశారు. సావిత్రిగా కీర్తిసురేష్ న్యాయం చేయగలదని భావించినా జెమినిగణేషన్‌లా నటించడం కొత్తకుర్రాడైన దుల్కర్‌కి సాధ్యమవుతుందా? ఆ స్థాయిలో నటించగలడా? అని ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ తాజాగా దుల్కర్ పుట్టినరోజున ఆయన లుక్‌ని ఈ చిత్రం యూనిట్ విడుదలచేసింది.
మరి ఈ విడుదలైన లుక్‌లో దుల్కర్ కింగ్ ఆఫ్ రొమాన్స్‌గా పేరొందిన జెమినీ గణేషన్‌లానే కనిపిస్తున్నాడు. దీంతో ఆయన కూడా ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం ఖాయమనే మాట గట్టిగా వినిపిస్తుంది. ముందు దుల్కర్‌సల్మాన్ జెమిని గణేశన్ పాత్రలో ఎలా ఉంటాడో అనుకున్న వాళ్లకి ఈ లుక్ తో వారికి ఇంకా ఆలోచించడానికి ఏం లేదన్నట్టు చెప్పేసాడు. నాగ్ అశ్విన్ కూడా అన్ని పాత్రలను బాగా స్టడీ చేసిన తర్వాతే ఇలా 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించాలని ప్లాన్ చేసాడు. మరి ఇప్పటివరకు లుక్స్ లో మంచి సక్సెస్ అయినా నాగ్ అశ్విన్ 'మహానటి'ని తెరకెక్కించి మంచి మార్కులే కొట్టేసేలా వున్నదంటున్నారు.