డైరెక్ట‌ర్‌కు షాక్ ఇచ్చిన కీర్తి

Update: 2017-12-23 12:00 GMT

టాలీవుడ్ లో రామ్ హీరోగా వచ్చిన నేనూ శైలజ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో ‘నేను లోకల్’ సినిమాతో మరో అద్భుతమైన విజయం అందుకొని టాప్ పొజీషన్లోకి వెళ్లింది. ప్రస్తుతం కీర్తి పవన్ కళ్యాణ్‌ సరసన ‘అజ్ఞాతవాసి’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘మహానటి’ సినిమాలో నటిస్తున్నంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధిస్తే..నెంబర్ వన్ రేస్ లోకి దూసుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా అతి తక్కువ కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది..కీర్తి సుకేష్.

తెలుగు తో పాటు తమిళ ఇండస్ట్రీ లో కూడా తన సత్తా చాటుతుంది. రీసెంట్ గా తమిళ హీరో విజయ్ తో నటించిన కీర్తీ ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు సమాచారం. భారతీ సినిమా చరిత్రలో నటీనటులపై సినిమాలు తీసింది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో తెలుగులో మహానటి సావిత్రి బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను తీస్తున్నాను అని ప్రకటించేస్తే.. మరోవైపు బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ బయోపిక్ కూడా వడివడిగా ముందుకు సాగుతుంది.

తాజాగా ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ‘మహానటి’ సినిమా కోసం కీర్తి సురేష్ ని బ‌రువు పెర‌గాల‌ని కీర్తికి ద‌ర్శ‌కుడు సూచించాడ‌ట‌. 'మ‌హాన‌టి' సినిమా కోసం కీర్తి చాలా మేకోవ‌ర్ సాధించింది. అయితే మ‌రింత బ‌రువు పెరిగేందుకు మాత్రం కీర్తి సురేష్ నో చెప్పిందట. ఎందుకంటే తాను మరింత లావు పెరిగితే..చాలా లుక్ పోతుందని..మళ్లీ సన్నబడటం చాలా కష్టమని ఖచ్చితంగా చెప్పేసిందట.

వాస్తవానికి కీర్తి కాస్త కురచగా ఉంటుంది..దానికి తోడు మరీ లావెక్కితే..చూడటానికి అసహ్యంగా కనిపిస్తుందని భావించి దర్శకుడికి ససేమిరా అని చెప్పేసిందట. గతంలో అనుష్క ‘సైజ్ జీరో’ కోసం విపరీతంగా బరువెక్కి తగ్గడానికి నానా కష్టాలు పడ్డ విషయం తెలిసిందే. బహుషా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని కీర్తి దర్శకుడికి నో చెప్పి ఉండవొచ్చని అనుకుంటున్నారు.

Similar News