నాని - నివేత థామస్ - ఆది పినిశెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'నిన్నుకోరి' చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చెయ్యడానికి దిగిపోనుంది. ఇక చిత్రం విడుదల సందర్భంగా హీరో హీరోయిన్స్ మీడియా ప్రతినిధులకు ఇంటర్వ్యూ లు గట్రాఇస్తూ 'నిన్నుకోరి' సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగానే నాని చేసిన కొన్ని వ్యాఖ్యల మీద టాలీవుడ్ పెద్ద చర్చకి తెర లేపింది. మాములుగా నాని ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉంటాడు. టాలీవుడ్ లో అందరితో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ తన పని తాను చేసుకుపోయే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు నాని.
అయితే ఇప్పుడు నానిని కొంతమంది మీడియా ప్రతినిధులు మిమ్మల్ని ఇంకా మినిమమ్ గ్యారెంటీ హీరో కిందే జమకడుతున్నారని అడగగా... దానికి నాని కొంచెం కోపంగానే సినిమా వసూళ్ల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని.... సినిమా బావుంటేనే సినిమా గురించి మాట్లాడండి... సినిమా బాగోకపోయినా దాని వసూళ్లు బాగున్నాయి అని ఈ మధ్యన బాగా వినబడుతుంది. అలా సినిమా వసూళ్ల గురించి మాట్లాడడం నాకు నచ్చదు. అసలు సినిమా బావుంటేనే ప్రేక్షకులు సినిమా చూడడానికి వస్తారు అంటూ అసహనం ప్రదర్శించాడు.
అయితే నాని ఇలా ఏ సినిమా వసూళ్ల గురించి మాట్లాడాడో అందరికి ఇట్టే అర్ధమైపోయిందని అంటున్నారు. తాజాగా విడుదలైన 'దువ్వాడ జగన్నాథం' చిత్రం టాక్ బాగోకపోయినా మంచి వసూళ్లు రాబట్టిందని బాగా ప్రచారం జరుగుతుంది. మరి నాని ఈ సినిమా వసూళ్లపైనే డైరెక్ట్ పంచ్ వేశాడా? అనిపిస్తుంది కదూ..